జగిత్యాల
న్యూస్‌రీల్
7
మంగళవారం శ్రీ 27 శ్రీ జనవరి శ్రీ 2026
అర్హులందరికీ పథకాలు
జగిత్యాల: సంక్షేమ పథకాలను అర్హులందరికీ అందిస్తున్నామని, మహిళలను
కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని, రైతులకు భరోసా, విద్య, వైద్యరంగాల్లో జిల్లా అగ్రగామిగా నిలుస్తోందని కలెక్టర్ సత్యప్రసాద్ వెల్లడించారు. జిల్లాకేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో ప్రజాప్రభుత్వం ముందుకు సాగుతోందని, పథకాల అమలులో జిల్లా ముందంజలో ఉందని తెలిపారు.
రాయికల్:వేషధారణలో చిన్నారులు
మహిళల ఆర్థిక సాధికారత కోసం
మహిళలు ఆర్థిక సాధికారత కోసం జిల్లాలో రూ.659.57 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామన్నారు. 2024–25కుగాను వడ్డీమాఫీ కింద 11,825 సంఘాలకు రూ.26కోట్ల వడ్డీమాఫీ అందించామన్నారు. సీ్త్రనిధి ద్వారా రూ.60 కోట్లు ఇచ్చామన్నారు. 1,77,289 మంది మహిళల చీరలు అందించామన్నారు. మహిళాసంఘాల ద్వారా 134 కొనుగోలు కేంద్రాలద్వారా రూ.3.50 కోట్ల విలువైన ధాన్యం సేకరించామన్నారు. రూ.5 కోట్లతో జిల్లా సమైక్య భవనం నిర్మిస్తున్నామని తెలిపారు.
ఉచిత బస్సు ప్రయాణం వరం
మహాలక్ష్మీ పథకాన్ని 2,78,096 మంది వినియోగించుకున్నారని తెలిపారు. 2,89,725 గ్యాస్ సిలిండర్లను రూ.500కే సరఫరా చేశామన్నారు. 2,09,507 కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందించామని వివరించారు. 1055 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 11,720 మంది గర్భిణులు, 13,376 మంది పిల్లల కు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీ సొంత భవనాలకు రూ.8.28 కోట్లు మంజూరు చేశామన్నారు. దివ్యాంగులకు 66 రిట్రో వాహనాలు, 9 ల్యాప్‌టాప్‌లు, 20 బ్యాటరీ ఆపరేటెడ్ వీల్‌చైర్లు అందించామన్నారు. షెడ్యూల్డ్ కులాలు, గిరిజన, వెనుకబడిన సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులకు వసతులు కల్పిస్తున్నామని, ఇటీవల 200 శాతం డైట్ చార్జీలు, 40 శాతం కాస్మోటిక్ చార్జీలు పెంచామన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో సౌకర్యాలు కల్పిస్తున్నామని, రూ.400 కోట్లతో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ మంజూరు కాగా.. జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాల్లో 25 ఎకరాల చొప్పున భూమి కేటాయించామన్నారు. జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి 25 ఎకరాలు కేటాయించామన్నారు. కోరుట్లలో నవోదయ విద్యాలయం ఏర్పాటైందన్నారు. ధర్మపురికి డిగ్రీ కళాశాల మంజూరైందన్నారు. జిల్లాలో పదో తరగతి చదివే విద్యార్థులకు అల్పాహారం కోసం 186 ఉన్నత పాఠశాలలకు రూ.14,75,730 కేటాయించామన్నారు.
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, 11,079 మందికి ఇళ్లు కేటాయించగా.. 6,392 ఇళ్ల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. లబ్ధిదారులకు రూ.134.24 కోట్లు చెల్లించామని తెలిపారు. ఇందిరమ్మ రైతు భరోసా ద్వారా 2025 వానాకాలానికి 2,25,406 మంది రైతులకు రూ.243.75 కోట్లు రైతుల ఖాతాల్లో జమచేశామన్నారు. రైతుబీమా కింద మరణించిన 5,215 రైతు కుటుంబాలకు రూ.260.75 కోట్లు ఆర్థిక చేయూత కల్పించామని పేర్కొన్నారు. వానాకాలం సీజన్‌లో 436 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 3,31,786 క్వింటాళ్ల దొడ్డు రకం సేకరించి రూ. 792.39 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశామన్నా రు. 50,029 టన్నుల సన్న ధాన్యానికి రూ.119.52 కోట్లతోపాటు, క్వింటాల్‌కు రూ.500 చొప్పున బోనస్ అందించామన్నారు. 45,867 మందికి కొత్త రేషన్‌కార్డులు ఇచ్చామని, ప్రతినెలా 6,435 టన్నుల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని వివరించారు.
పేదలకు మెరుగైన వైద్యం
పేదలకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో 2025–26 ఆర్థిక సంవత్సరంలో 1,07,065 మందికి రూ.49.21 కోట్ల విలువైన శస్త్ర చికిత్స చేయించినట్లు వివరించారు.
పారదర్శకంగా భూభారతి
భూభారతి చట్టం పారదర్శకంగా చేపడుతున్నామని, జిల్లాలోని 20 మండలాలను పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకుని రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఇప్పటివరకు 25,672 మంది రైతుల నుంచి దరఖాస్తులు తీసుకుని భూభారతి పోర్టల్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయిల్ పాం సాగుకు రైతులు ముందుకొస్తున్నారని, 3,750 ఎకరాల లక్ష్యంకాగా, ఇప్పటివరకు 514 ఎకరాల్లో మొక్కలు నాటించామని పేర్కొన్నారు. వీరికి నిర్వహణ కింద రూ.48.29లక్షల రాయితీని ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. ఎస్పీ అశోక్‌కుమార్, అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు
జగిత్యాలటౌన్: గణతంత్ర వేడుకల్లో భాగంగా చి న్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నా యి. ప్రభుత్వ పాఠశాలలు, గురుకులం, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ఆటపాటలతో ఆలరించారు.
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల
జగిత్యాల


