కొండగట్టు అంజన్న సన్నిధిలో మంత్రి అడ్లూరి పూజలు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి వారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికా రు. అనంతరం మున్సిపల్ ఎన్నికల ప్రచారరథానికి ఆయన పూజచేయించారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, నాయకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
ఈఓపై మంత్రికి ఫిర్యాదు
ఆలయ ఈవో శ్రీకాంత్‌రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అర్చకులు మంత్రి అడ్లూరి దృష్టికి తీసుకెళ్లారు. ఈఓ అర్చకులతో దురుసుగా ప్రవరిస్తూ.. మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన మంత్రి దేవాదాయశాఖ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడి విచారణ చేపట్టాలని ఆదేశించారని అర్చకులు తెలిపారు.
జెండా ఆవిష్కరించిన మంత్రి
ధర్మపురి: ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జాతీయజెండాను మంత్రి ఆవిష్కరించారు. అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా సీఎం రేవంత్‌రెడ్డి అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని తెలిపారు. పథకాలపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు.
రూ.513.10 కోట్ల రుణాల పంపిణీ
జగిత్యాలఅగ్రికల్చర్: గణతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో మహిళా గ్రూపులకు రూ.513.10కోట్ల రుణాలను కలెక్టర్ సత్యప్రసాద్ పంపిణీ చేశారు. వడ్డీలేని రుణాల కింద రూ.508 కోట్లు అందించారు. పట్టణ పేదరిక నిర్మూలన పథకం కింద 5.10కోట్లు పంపిణీ చేశారు. రుణాలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని సూచించారు.
యువత సన్మార్గంలో ముందుకెళ్లాలి
మల్లాపూర్: యువత సన్మార్గంలో నడవాలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని మినీస్టేడియంలో నిర్వహించిన మల్లాపూర్ క్రికెట్ లీగ్ (ఎంపీఎల్) టోర్నమెంట్ ముగింపు వేడుకలకు ముఖ్య ఆతిథిగా హాజరయ్యారు. విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. మానసిక వికాసానికి క్రీడలు దోహదపడుతాయన్నారు. జెడ్పీ నిధులు రూ.10లక్షలతో మినీస్టేడియం నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. టోర్నీ విజేత రఫీ రాయల్‌కు విన్నర్‌కప్‌తోపాటు సొంతంగా రూ.30వేలు, రన్నర్ సామ నైట్ రైడర్స్‌కు కప్‌తో పాటు రూ.15వేలు అందించారు. సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, పట్టణ అధ్యక్షుడు బండి లింగస్వామి, ఎంపీఎల్ చైర్మన్, నిర్వాహకులు పాల్గొన్నారు.
వేడుకలకు భారీ బందోబస్తు
జగిత్యాలక్రైం: జిల్లాకేంద్రంలోని పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గ్రౌండ్‌లోకి వెళ్లే విద్యార్థులు, అధికారులు, ప్రజలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వేడుకలు చూసేందుకు జనం భారీగా తరలిరావడంతో డీఎస్పీ రఘుచందర్ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తును పర్యవేక్షించారు.
కొండగట్టు అంజన్న సన్నిధిలో మంత్రి అడ్లూరి పూజలు


