సర్పంచ్‌ నుంచి ఎమ్మెల్యే దాకా.. | - | Sakshi
Sakshi News home page

సర్పంచ్‌ నుంచి ఎమ్మెల్యే దాకా..

Feb 4 2026 7:26 AM | Updated on Feb 4 2026 7:26 AM

సర్పంచ్‌ నుంచి ఎమ్మెల్యే దాకా..

సర్పంచ్‌ నుంచి ఎమ్మెల్యే దాకా..

మంథని: పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలోని ముత్తారం మండలం ఖమ్మంపల్లి గ్రామానికి చెందిన చంద్రుపట్ల రాంరెడ్డి 1970లోనే సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తర్వాత ఎంపీపీగా పనిచేసి 1994లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సర్పంచ్‌ మొదలు.. ఎమ్మెల్యే వరకు ఆయన అనేక ప్రజాసమస్యలపై పోరాటం చేశారు. ప్రజల్లో తన పేరును పదిలం చేసుకున్నారు.

1970లో రాజకీయాల్లోకి..

1970లో రాజకీయాల్లోకి వచ్చిన రాంరెడ్డి.. సర్పంచ్‌గా కొనసాగుతూనే మండల ప్రెసిడెంట్‌ బాధ్యలు నిర్వహించారు. 1989లో ఎంపీపీగా ఎన్నికయ్యారు. 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి మాజీ స్పీకర్‌ దుద్దిళ్ల శ్రీపాదరావుపై విజయం సాధించారు. 1999లో శ్రీధర్‌బాబుపై ఓటమి చెందారు. తర్వాత తెలంగాణ ఉద్యమంలో టీఆర్‌ఎస్‌లో చేరి చురుకుగా పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో వ్యవసాయానికి విద్యుత్‌ సరఫరా విషయంలో విద్యుత్‌ అధికారులపై దాడిచేసి గుర్తింపు పొందారు. పదవుల కన్నా ప్రజలే ముఖ్యమని భావించారు. రాంరెడ్డి కుమారుడు సునీల్‌రెడ్డి(బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు) కాగా, రెండోకుమారుడు అమెరికాలో స్థరపడ్డారు. గురువారం ముత్తారం మండలం సీతంపేటలోని వ్యవసాయ క్షేత్రంలో రాంరెడ్డి అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. రామన్న మృతిపై స్వగ్రామంతోపాటు నియోజకవర్గంలోని అయన అభిమానులు, బీజేపీ తదితర పార్టీలు, కుటుంభ సభ్యుల్లో విషాదం నింపింది. పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.

ప్రజాసేవలో రాంరెడ్డి ప్రత్యేక ముద్ర

అనారోగ్యంతో మంథని మాజీ ఎమ్మెల్యే కన్నుమూత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement