బీఎల్వోలు విధులు జాగ్రత్తగా నిర్వర్తించాలి | - | Sakshi
Sakshi News home page

బీఎల్వోలు విధులు జాగ్రత్తగా నిర్వర్తించాలి

Feb 4 2026 7:26 AM | Updated on Feb 4 2026 7:26 AM

బీఎల్వోలు విధులు జాగ్రత్తగా నిర్వర్తించాలి

బీఎల్వోలు విధులు జాగ్రత్తగా నిర్వర్తించాలి

జగిత్యాల: బీఎల్వోలు తమ విధులను జాగ్రత్తగా నిర్వర్తించాలని అదనపు కలెక్టర్‌ లత అన్నారు. మంగళవారం బీఎల్వోలతో సమావేశమయ్యారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్వోల కీలకపాత్ర అని, అర్హులందరినీ నమోదు చేయాలని పేర్కొన్నారు. ఫాం 6,7,8 లను సక్రమంగా స్వీకరించాలని, సకాలంలో ప్రాసెస్‌ చేయాలన్నారు. ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని, మొబైల్‌ యాప్‌ల ద్వారా డేటా అప్‌లోడ్‌ చేయాలన్నారు. ఎన్నికలకు స్వచ్ఛతకు అందరు సహకరించాలన్నారు. కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీవో మధుసూదన్‌, అర్బన్‌ తహసీల్దార్‌ రాంమోహన్‌, బీఎల్వోలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement