సెంటిమెంట్‌ కోసం బీఆర్‌ఎస్‌ డ్రామాలు | - | Sakshi
Sakshi News home page

సెంటిమెంట్‌ కోసం బీఆర్‌ఎస్‌ డ్రామాలు

Feb 2 2026 8:01 AM | Updated on Feb 2 2026 8:01 AM

సెంటి

సెంటిమెంట్‌ కోసం బీఆర్‌ఎస్‌ డ్రామాలు

సెంటిమెంట్‌ కోసం బీఆర్‌ఎస్‌ డ్రామాలు ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ నేటి ప్రజావాణి రద్దు ఘనంగా శ్రీలక్ష్మీనర్సింహస్వామి జాతర ఉత్సవాలు ఆపరేషన్‌ స్మైల్‌ విజయవంతం

● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి: మున్సిపల్‌ ఎన్నికల్లో సెంటిమెంట్‌ను రగిలించి ఓట్లు దండుకోవడానికి బీఆర్‌ఎస్‌ మాజీమంత్రులు కేటీఆర్‌, హరీష్‌రావు డ్రామాలు చేస్తున్నారని మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్‌ అన్నారు. ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో కేసీఆర్‌ను సిట్‌ విచారణకు పిలిస్తే కాంగ్రెస్‌పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ చేసిన పాపాల్లో ఒకటి కాశేశ్వరం ప్రాజెక్టు అయితే రెండోది ఫోన్‌ ట్యాపింగ్‌ అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కల్వకుంట రాజ్యాన్ని తీసుకొస్తామని భావిస్తే ప్రజలు మార్పుకోసం కాంగ్రెస్‌కు పట్టం కట్టారని అన్నారు. బీఆర్‌ఎస్‌ చేసిన పాపాలకు సిట్‌తోపాటు కాళేశ్వరం విషయంలో సీబీఐ కూడా వస్తుందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై కన్నబిడ్డ చేసిన ఆరోపణలకు కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఎస్‌.దినేష్‌, కుంట సుధాకర్‌, సింహరాజు ప్రసాద్‌, నరేందర్‌ తదితరులున్నారు.

జగిత్యాలటౌన్‌:

కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్‌ సత్యప్రసాద్‌ తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కోడ్‌ ముగిసే వరకూ వినతులు స్వీకరణ ఉండదని, ప్రజలు సహకరించాలని కోరారు.

మల్యాల: మండలంలోని మానాల గ్రామంలోగల నల్లగుట్ట లక్ష్మీనర్సింహాస్వామి జాతరలో భాగంగా ఆదివారం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ఉత్సవమూర్తులను మేళతాళాల మధ్య శోభాయాత్ర చేపట్టారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, సర్పంచ్‌ బల్మూరి పాపారావు, ఉప సర్పంచ్‌ ఎడిపెల్లి జమున, మల్యాల సర్పంచ్‌ బొట్ల జయప్రసాద్‌ స్వామివారిని దర్శించుకున్నారు.

జగిత్యాలక్రైం: బాలకార్మిక వ్యవస్థ నిర్మూలించడానికి జిల్లాలో ఏటా రెండుసార్లు ఆపరేషన్‌ స్మైల్‌, ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఎస్పీ అశోక్‌ కుమార్‌ తెలిపారు. తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి చేపట్టిన ఆపరేషన్‌ స్మైల్‌ కార్యక్రమం అన్ని శాఖల అధికారుల సమన్వయంతో విజయవంతం చేశామని పేర్కొన్నారు. జిల్లాలో 37 మంది బాలకార్మికులను గుర్తించి చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి అప్పగించామన్నారు. 18 ఏళ్ల లోపు పిల్లలతో పనిచేయిస్తున్నవారిపై ఐదు కేసులు నమోదు చేశామన్నారు. బాలకార్మికులను పనిలో పెట్టుకుంటే 100 డయల్‌కు కాల్‌ చేసి పోలీసులకు సమాచారం అందించాలన్నారు.

కొండగట్టు గిరి ప్రదక్షిణ

మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామివారికి వందలాదిమంది భక్తులు పూజలు చేసి గిరి ప్రదక్షిణలో పాల్గొన్నారు. ఆదివారం పౌర్ణమిని పురస్కరించుకొని వివిధ గ్రామాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి జై శ్రీరాం, జైహనుమాన్‌ అంటూ గిరి ప్రదక్షిణ పూర్తి చేశారు.

సెంటిమెంట్‌ కోసం   బీఆర్‌ఎస్‌ డ్రామాలు
1
1/3

సెంటిమెంట్‌ కోసం బీఆర్‌ఎస్‌ డ్రామాలు

సెంటిమెంట్‌ కోసం   బీఆర్‌ఎస్‌ డ్రామాలు
2
2/3

సెంటిమెంట్‌ కోసం బీఆర్‌ఎస్‌ డ్రామాలు

సెంటిమెంట్‌ కోసం   బీఆర్‌ఎస్‌ డ్రామాలు
3
3/3

సెంటిమెంట్‌ కోసం బీఆర్‌ఎస్‌ డ్రామాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement