కౌంటింగ్ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలి
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికలకు కౌంటింగ్ కేంద్రాలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి ఎస్‌కేఎన్‌ఆర్‌లోని కౌంటింగ్ హాల్‌ను పరిశీలించారు. ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ అవాంఛ నీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తామన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌ డ్, ఆర్డీవో మధుసూదన్, బల్దియా కమిషనర్ స్పందన, ప్రిన్సిపల్ అశోక్‌కుమార్ పాల్గొన్నారు.
రైతులు మార్కెట్‌కు పచ్చి పసుపు తీసుకురావొద్దు
ఇబ్రహీంపట్నం: రైతులు పచ్చి పసుపును తీసుకురావద్దని నిజామాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి సూచించారు. మంగళవారం మండలంలోని డబ్బా, ఇబ్రహీంపట్నం గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించారు. పచ్చి పసుపును మార్కెట్‌కు తీసుకొస్తే నష్టపోతారని తెలిపారు. ఎండిన తరువాత పాలిష్ చేసి తీసుకొస్తే వ్యాపారుల మధ్య పోటీ పెరిగి గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. మార్కెట్ యార్డులో పచ్చి పసుపు విక్రయానికి అనుమతి లేదన్నారు. కార్యక్రమంలో రైతులు దేశెట్టి జీవన్, బైన నడ్పి మల్లయ్య, బుక్య బన్సి లాల్, జగన్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
కౌంటింగ్ కేంద్రాల్లో బందోబస్తు ఏర్పాటు చేయాలి


