రైతులు పంటలను ఎగుమతి చేయాలి
రాయికల్: రైతులు తాము పండించిన పంటలను నేరుగా ఎగుమతి చేసుకుంటే ఆర్థికంగా వృద్ధి సాధించవచ్చని పలువురు శాస్త్రవేత్తలు అన్నారు. రాయికల్ మండలం అల్లీపూర్‌లో మంగళవారం వ్యవసాయ ఎగుమతులు, అవకాశాలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన డెవలప్‌మెంట్ మేనేజర్ ఖాదర్ మాట్లాడుతూ రైతులు తాము పండించిన పంటలను ఎగుమతి చేయడం ద్వారా వచ్చే ఆదా యంపై అవగాహన కల్పించారు. శాస్త్రవేత్తలు స్వాతి, సుమలత, రవి వరి, మామిడిలో సంభవించే వ్యాధులు, నివారణ చర్యలపై వివరించారు. ఏవో ముక్తేశ్వర్, ఏఈవో సతీశ్, సర్పంచ్ ఎంబారి గౌతమి, ఉపసర్పంచ్ వినయ్ పాల్గొన్నారు.


