మున్సిపల్ స్టార్స్
● మున్సిపల్ నుంచి చట్టసభలకు ప్రస్థానం
● శాసనసభలో అడుగిడిన గంగుల, సోమారపు, కోరుకంటి
● కేంద్ర సహాయ మంత్రిగా ఎదిగిన బండి సంజయ్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతోంది. ప్రభుత్వం రేపోమాపో అధికారికంగా నోటిఫికేషన్ జారీ కానుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని 13 మున్సిపాలిటీలు, 2 కార్పొరేషన్లలో ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. వీరిలో సీనియర్లతో పాటు యువ నాయకులున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఒకప్పుడు కౌన్సిలర్‌గా, కార్పొరేటర్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పలువురు నేడు ఎమ్మెల్యేలు, మంత్రులు, కేంద్ర మంత్రులుగా ఎదిగిన తీరు తోటి రాజకీయ సహచరులకు, రాబోయేతరానికి స్ఫూర్తి నింపింది. పాత జిల్లాలో అనేక మంది స్థానిక సంస్థల నుంచి పోటీ చేసి శాసనసభ, పార్లమెంటు ఉభయ సభల్లో అడుగు పెట్టారు. అలాంటి వారిలో సీనియర్ రాజకీయ నాయకులతోపాటు ప్రస్తుతం చట్టసభల్లో ప్రాతినిధ్యం వహిస్తున్న వారిపై కథనం.


