నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
● కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల: నామినేషన్ల ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గురువారం జగిత్యాల బల్దియాలోని నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించారు. రిటర్నింగ్ అధికారులు పొరపాట్లకు తావివ్వొద్దన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పక్కాగా అమలయ్యేలా చూడాలన్నారు. ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ స్పందన, తహసీల్దార్ రాంమోహన్ ఉన్నారు.
ఫ్లయింగ్‌స్క్వాడ్ అప్రమత్తంగా ఉండాలి
ఎన్నికల నేపథ్యంలో ఫ్లయింగ్‌స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. జోనల్ అధికారులు ఎఫ్‌ఎస్టీ, ఎస్‌ఎస్టీ టీంలతో సమావేశమయ్యారు. ప్రజలు రూ.50వేల లోపు మాత్రమే తీసుకెళ్లాలని, పైబడి తీసుకెళ్తే ఆధారాలు చూపించాలన్నారు. ప్రలోభాలు, మద్యం వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు. మద్యం, డబ్బు, లిక్కర్ పట్టుబడితే వీడియో రికార్డింగ్ తప్పనిసరి అన్నారు. కార్యాలయంలో 24/7 టోల్‌ఫ్రీ నంబరు 9666234383లో సంప్రదించాలన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, అబ్జర్వర్ శ్రీనివాస్, నోడల్ అధికారులు మనోజ్‌కుమార్, భాస్కర్ పాల్గొన్నారు.
అనంతరం కలెక్టర్ జనరల్ అబ్జర్వర్‌ను ఖర్టాడే కాళీచరణ్ సుమాదరావును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.


