ఎస్సారెస్పీ కాలువలు ధ్వంసం చేస్తే కేసులు | - | Sakshi
Sakshi News home page

ఎస్సారెస్పీ కాలువలు ధ్వంసం చేస్తే కేసులు

Jan 30 2026 6:49 AM | Updated on Jan 30 2026 6:49 AM

ఎస్సా

ఎస్సారెస్పీ కాలువలు ధ్వంసం చేస్తే కేసులు

ఇబ్రహీంపట్నం: ఎస్సారెస్పీ కాలువలను ధ్వంసం చేస్తే కేసులు నమోదు చేస్తామని ఇరిగేషన్‌ ఈఈ సురేష్‌ రైతులను హెచ్చరించారు. మండలంలోని బర్దీపూర్‌ శివారులో డిస్ట్రిబ్యూటర్‌ 24 నుంచి పంట పొలాలకు వెళ్లే ఉపకాలువను కొందరు రైతులు ధ్వంసం చేశారు. ఆ కాలువలను గురువారం పరిశీలించారు. చివరి ఆయకట్టుకు నీరు వెళ్లకుండా కాలువలను పూడ్చితే కఠిన చర్యలు తప్పవన్నారు.

‘గంగనాల’కు నీరొచ్చేలా చూస్తాం

ఇబ్రహీంపట్నం: సదర్‌మాట్‌ ప్రాజెక్టు నుంచి గంగనాల ప్రాజెక్టుకు నిరంతరం నీరు వచ్చేలా చూస్తామని ఎస్‌ఈ జగదీశ్‌ తెలిపారు. సదర్‌మాట్‌ నుంచి గంగనాలకు వచ్చే నీటి ప్రవాహాన్ని గురువారం పరిశీలించారు. సదర్‌మాట్‌ నిర్మాణంలో భాగంగా గోదావరిలో అడ్డుగా రాళ్లు వేయడంతో గంగనాలకు నీరు రాక పంటలు పండించుకోలేకపోతున్నామని ఆయకట్టు రైతులు అధికారులకు విన్నవించారు. అలాగే ఈనెల 16న ప్రాజెక్టు ప్రారంభానికి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌ విన్నవించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సదర్‌మాట్‌ నుంచి నీరు రాకుండా అడ్డుగా వేసిన బండరాళ్లను ఎస్‌ఈ పరిశీలించారు. ఓ చోట పరుపుబండ అడ్డుగా ఉండడాన్ని గమనించి బ్లాస్టింగ్‌ ద్వారా తొలగిస్తామని తెలిపారు. ఆయన వెంట ఈఈ సురేష్‌, డీఈ మురళీకృష్ణ, ఏఈలు సజీత్‌, కవిత, చేతన్‌, రైతులు పాల్గొన్నారు.

సరిహద్దుల్లో మూడు చెక్‌పోస్టులు

జగిత్యాలక్రైం: మున్సిపల్‌ ఎన్నికల నేపథ్యంలో పోలీసుశాఖ అలర్ట్‌ అయ్యింది. జిల్లా సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపట్టేలా మూడు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసింది. ఇతర జిల్లాల నుంచి వస్తున్న వాహనాలను చెక్‌పోస్టుల వద్ద తనిఖీలు చేపడుతోంది. జిల్లాలో ఐదు మున్సిపాలిటీల్లో నిర్వహించనున్న ఎన్నికలకు 6 ఫ్లయింగ్‌స్క్వాడ్స్‌, ఐదు స్టాటిస్టిక్స్‌ సర్వైలైన్స్‌ టీమ్స్‌, 50 జోనల్‌ ఆఫీసర్లను ఉన్నతాధికారులు నియమించారు. అలాగే అభ్యర్థుల వ్యయ ఖర్చులు, ప్రచార సామగ్రి, ర్యాలీలు, సభలు, సమావేశాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మెట్‌పల్లి శివారులోని గండి హనుమాన్‌ దేవాలయం వద్ద, ధర్మపురి మండలం రాయపట్నం వద్ద, కొడిమ్యాల మండలం దొంగలమర్రి వద్ద చెక్‌పోస్టులు ప్రారంభించి 24 గంటల పాటు తనిఖీలు చేపడుతున్నారు. డబ్బు, మద్యం, ఇతర వస్తువులు తరలించి ఓటర్లను ప్రలోభపెట్టకుండా వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ఈ విషయమై ఎస్పీ అశోక్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఇతర జిల్లాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేసేందుకు జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని, సిబ్బంది 24 గంటల పాటు తనిఖీలు చేపడతారని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే సంజయ్‌ తులాభారం

రాయికల్‌: పట్టణంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఎమ్మెల్యే సంజయ్‌ తన మొక్కు చెల్లించుకున్నారు. సంజయ్‌ ఎమ్మెల్యేగా గెలిస్తే నిలువెత్తు బంగారం సమర్పిస్తానని మాజీ కో–ఆప్షన్‌ మహేందర్‌బాబు స్వామివారికి మొక్కుకున్నారు. ఆ మొక్కు గురువారం తీర్చుకున్నారు. స్వామివారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ మోర హన్మండ్లు, మాజీ వైస్‌ చైర్మన్‌ రమాదేవి, నాయకులు పడిగెల రవీందర్‌రెడ్డి, కోల శ్రీనివాస్‌, మోర రాంమూర్తి పాల్గొన్నారు.

ఎస్సారెస్పీ కాలువలు   ధ్వంసం చేస్తే కేసులు1
1/3

ఎస్సారెస్పీ కాలువలు ధ్వంసం చేస్తే కేసులు

ఎస్సారెస్పీ కాలువలు   ధ్వంసం చేస్తే కేసులు2
2/3

ఎస్సారెస్పీ కాలువలు ధ్వంసం చేస్తే కేసులు

ఎస్సారెస్పీ కాలువలు   ధ్వంసం చేస్తే కేసులు3
3/3

ఎస్సారెస్పీ కాలువలు ధ్వంసం చేస్తే కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement