కొలువుదీరిన వనదేవతలు
అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
వెల్గటూర్/ధర్మపురి:వనదేవతల జాతర సందర్భంగా గురువారం సమ్మక్క గద్దైపెకి చేరారు. వెల్గటూర్ మండలకేంద్రంతోపాటు రాజారాంపల్లిలో అమ్మవారల దర్శనానికి భక్తులు పోటెత్తారు. మేళతాళాలు, డప్పుచప్పుళ్ల మధ్య కోయపూజారులు అమ్మవారిని తీసుకొచ్చారు. ఆలయ కమిటీ చైర్మెన్ ఏలేటి శైలేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో భక్తుల ఏర్పాట్లను పరిశీలించారు. డీఎంహెచ్‌వో సుజాత ఆదేశాల మేరకు హెల్త్‌క్యాంపు ఏర్పాటు చేశారు. పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ధర్మపురి లోని మోరోల్ల వాగు వద్ద అమ్మవార్లను గద్దైపెకి చేర్చారు. రాజారాంపల్లికి చెందిన ఏలేటి దేవేందర్‌రెడ్డి సమ్మక్క, సారలమ్మ ఉత్సవాల కోసం అమెరికా నుంచి వచ్చారు.


