నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
జగిత్యాల: ప్రైవేటు ఆస్పత్రుల నిర్వాహకులు నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అన్నారు. సోమవారం జిల్లా రిజిస్ట్రేషన్ అథారిటీ క్లీనికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్‌పై జిల్లాస్థాయి సమావేశం నిర్వహించారు. ఆస్పత్రులకు రిజిస్ట్రేషన్ తప్పకుండా ఉండాలని, ఎవరైనా కొత్త డాక్టర్లు వస్తే మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. ప్రోగ్రాం ఆఫీసర్లకు డివిజన్ల వారీగా కొన్ని ఆస్పత్రులను కేటాయించి తనిఖీ చేయాలని ఆదేశించారు. డీఎస్పీ స్పెషల్ బ్రాంచ్ అధికారి వెంకటరమణ, క్లీనికల్ ఎస్లాబ్లిష్మెంట్ పర్యవేక్షకులు కుతుబుద్దీన్, శంకర్ పాల్గొన్నారు.


