మేజిస్ట్రేట్‌కు సన్మానం
మెట్‌పల్లి: మెట్‌పల్లి సీనియర్ సివిల్ కోర్టు మేజిస్ట్రేట్ నాగేశ్వర్‌రావును బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా సన్మానించారు. ఆయన రాసిన ఓ ఆర్టికల్‌ను సుప్రీంకోర్టు ఉదాహరణగా చూపుతూ ఓ కేసులో జడ్జిమెంట్ వెలువరించింది. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు కంతి మోహన్‌రెడ్డి మాట్లాడుతూ మేజిస్ట్రేట్ రాసిన లీగల్ రిఫరెన్స్‌ను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోవడం సాధారణ విషయం కాదన్నారు. కార్యక్రమంలో సివిల్ మేజిస్ట్రేట్ అరుణ్‌కుమార్, న్యాయవాదులు ఉన్నారు.
వేటకు వెళ్లిన బీర్‌పూర్ శ్రీలక్ష్మీనృసింహస్వామి
జగిత్యాలరూరల్: బీర్‌పూర్ మండలకేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీలక్ష్మీనృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం పార్వేట్ ఉత్సవం నిర్వహించారు. స్వామివారు వేటకు వెళ్లారు. కార్యక్రమంలో అర్చకులు వొద్దిపర్తి సంతోష్‌కుమారాచార్యులు, చిన్న సంతోష్‌కుమార్, మధుకర్, డింగిరి హేమంత్ పాల్గొన్నారు.
బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి ఏడుగురు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకున్నారు. బాధితులతో ఎస్పీ నేరుగా మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు.
శేషాద్రినిరెడ్డికి ఎస్పీగా పదోన్నతి
జగిత్యాలక్రైం: ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి ఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ అశోక్ కుమార్ చేతుల మీదుగా పిప్పింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. శేషాద్రినిరెడ్డికి స్టార్ చిహ్నాన్ని అలంకరించి అభినందించారు. ఆమె కూకట్‌పల్లి–కుత్బుల్లాపూర్ ట్రాఫిక్ డీసీపీగా బదిలీ అయిన సందర్భంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు.
చదువుతోనే ఉన్నత శిఖరాలకు..
గొల్లపల్లి: విద్యార్థులు చదువుకుంటేనే ఉన్నత శిఖరాలకు చేరవచ్చని వ్యక్తిత్వ వికాస నిపుణుడు లయన్ బుర్ర మధుసూదన్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు గొల్లపల్లి లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, లక్ష్యాన్ని ఏర్పర్చుకుని చేరడానికి ప్రతినిత్యం కష్టపడాలన్నారు. ఎస్సై కృష్ణసాగర్‌రెడ్డి, లీడ్ ఇండియా ట్రైనింగ్ మేనేజర్ తాడూ రి శ్రీనివాస్, జీఎల్టీ కో–ఆర్డినేటర్ లయన్ ఇనుగుర్తి రమేశ్, అంజనారెడ్డి, ప్రిన్సిపాల్ సుంకరి రవి, లయన్స్ క్లబ్ గొల్లపల్లి అధ్యక్షుడు ముస్కు కరుణాకర్ రెడ్డి, కార్యదర్శి సాయిని నరహరి, సభ్యులు తాడూరి సత్యం, మల్లారెడ్డి, మోటివే షన్ స్పీకర్ పత్తెం శ్రీనివాస్ పాల్గొన్నారు.
మేజిస్ట్రేట్‌కు సన్మానం
మేజిస్ట్రేట్‌కు సన్మానం
మేజిస్ట్రేట్‌కు సన్మానం
మేజిస్ట్రేట్‌కు సన్మానం


