అయోమయం.. గందరగోళం | - | Sakshi
Sakshi News home page

అయోమయం.. గందరగోళం

Feb 3 2026 7:41 AM | Updated on Feb 3 2026 7:41 AM

అయోమయం.. గందరగోళం

అయోమయం.. గందరగోళం

కాంగ్రెస్‌లో బీఫామ్‌ల లొల్లి రెండువర్గాలుగా జీవన్‌రెడ్డి, సంజయ్‌ టికెట్లు ఎవరికి వచ్చేనో..? వెంటాడుతున్న రెబల్‌ గుబులు నేటితో ఉపసంహరణ పూర్తి

జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలో బీఫామ్‌ల లొల్లి ముదిరింది. సీనియర్‌ నాయకుడు, మాజీమంత్రి జీవన్‌రెడ్డి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ మధ్య రోజురోజుకూ గొడవలు ముదురుతున్నాయి. జీవన్‌రెడ్డి మొదటి నుంచి కాంగ్రెస్‌ జెండాపట్టిన కార్యకర్తలకే టికెట్లు ఇవ్వాలని పట్టుబడుతుండగా.. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి గెలిచి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నానని ప్రకటిస్తున్న సంజయ్‌కుమార్‌ తన వర్గీయులకే ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. మూడు రోజులుగా హైదరాబాద్‌లో ఈ పంచాయి తీ జరుగుతోంది. అయినా ఇంకా కొలిక్కి రాలేదు. విశ్వసనీయవర్గాల ప్రకారం ఇద్దరికీ చెరి సగం ఇస్తారని తెలిసింది. జీవన్‌రెడ్డి మాత్రం పార్టీలో పనిచేసిన వారికే ఇవ్వాలని పట్టుబడుతున్నారు. గతంలో సంజయ్‌ వెంట నడిచినవారు కాంగ్రెస్‌లో సభ్యత్వం తీసుకోకుండా.. కండువా కప్పుకోకుండా ఇప్పటికీ ఆయన వెంటే ఉన్నారు. ఇద్దరు వర్గీయులు కాంగ్రెస్‌ తరుఫునే నామినేషన్లు దాఖలు చేశారు. ఇక్కడే లొల్లి ముదురుతోంది. ఒకవేళ తన వర్గానికిగానీ.. లేదా సంజయ్‌ వర్గానికి వస్తే రెబల్‌తో ఇబ్బందులు ఏర్పడతాయి. దీనిని అటు బీఆర్‌ఎస్‌, ఇటు బీజేపీ అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నాయి. రెబల్స్‌ మధ్య ఓట్లు చీలితే గెలుపు సునాయాసం అవుతుందని భావిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం మాత్రం ఎవరికి టికెట్‌ వచ్చినా వారే ఒకరు ఉండాలని.. మిగతా వర్గం వారి బరిలో ఉండకూడదని, నామినేషన్లు ఉపసంహరించుకోవాలని ఆదేశించినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం మేరకే నడుచుకోవాలని, ఏ కొంచం పార్టీకి నష్టం వాటిల్లినా చర్యలు తీసుకుంటామని అధిష్టానం హెచ్చరించినట్లు తెలిసింది.

ఎవరికి దక్కేనో..?

నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగి యనుండటంతో ఆలోపే అభ్యర్థులకు బీఫామ్‌లు అందించాల్సి ఉంటుంది. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఒక్కోవార్డు నుంచి అటు జీవన్‌రెడ్డి వర్గీయులు, ఇటు ఎమ్మెల్యే వర్గీయులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఫామ్‌ ఇచ్చిన అభ్యర్థులకే ఆ పార్టీ ఎన్నికల గుర్తును కేటాయిస్తారు. మిగతా వారు ఉపసంహరించుకోకపోతే ఇండిపెండెంట్లుగా బరిలో నిలబడాల్సి వస్తుంది.

ఎవరికి రాకున్నా ఇబ్బందులే..

కాంగ్రెస్‌ పార్టీలో ఏ వర్గానికి టికెట్లు రాకున్నా ఎన్ని కల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. టికెట్లు కొందరికి రావన్న వార్త వెలువడటంతో మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఇంట్లో 16వ వార్డుకు చెంది న బొల్లి శేఖర్‌ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అక్కడున్న కార్యకర్తలు అడ్డుకోవడంతో పె ను ప్రమాదం తప్పింది. దీంతో ఒక్కసారిగా రాజ కీయం వేడెక్కింది. అధిష్టానం మాత్రం ఇప్పటికీ పేర్లను ప్రకటించలేదు. నేరుగా రిటర్నింగ్‌ ఆఫీసర్లకే కాంగ్రెస్‌ పార్టీ బీఫామ్‌లు అందించనున్నట్లు తెలిసింది. ప్రతి వార్డులో అటు జీవన్‌రెడ్డి వర్గీయులు, ఇటు ఎమ్మెల్యే వర్గీయులు ఆ పుకార్లతో నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వర్గానికి వచ్చాయని వారు, ఆ వర్గానికి వచ్చాయని వీరు ఇలా చర్చానీయాంశంగా మారడంతో అసలు ఎవరికి వ స్తున్నాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఏదేమైనా జగిత్యాల మున్సిపాలిటీ హాట్‌ టాపిక్‌గా మారింది.

రెబల్స్‌తో గుబులు

నామినేషన్ల స్వీకరణ, పరిశీలన ఘట్టం ముగియడంతో అందరి దృస్టి బీఫామ్‌లపైనే పడింది. బీఫామ్‌లు ఎవరికి దక్కుతాయో తెలియని దుస్థితి నెలకొంది. బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలకు చెందిన అభ్యర్థులకు బీఫామ్‌ ఇస్తున్నారు. కాంగ్రెస్‌లో మాత్రం ఇరువర్గాల మధ్య గొడవ జరుగుతోంది. ఏ వర్గానికి టికెట్‌ రాకుంటే ఆ వర్గం నుంచి స్వతంత్రంగానైనా నిలబడాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే జరిగితే టికెట్‌ దక్కిన అభ్యర్థికి ఇబ్బందికరంగా మారనుంది.

ప్లాన్‌ బీ అమలయ్యేనా...

ఆయా వర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్లాన్‌ బీ అమలు చేస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీ టికెట్‌ రాని పక్షంలో ప్లాన్‌ బీ అమలు చేసి స్వతంత్ర అభ్యర్థిగా నిలబెట్టాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అలా నిలబడితే రెబల్స్‌ బెడద తప్పదు. దీంతో బీఆర్‌ఎస్‌, బీజేపీకి అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement