కాపర్‌ చోరీ కేసులో ఒకరి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

కాపర్‌ చోరీ కేసులో ఒకరి అరెస్ట్‌

Jan 20 2026 7:38 AM | Updated on Jan 20 2026 7:38 AM

కాపర్

కాపర్‌ చోరీ కేసులో ఒకరి అరెస్ట్‌

● 100 కిలోల రాగితీగ స్వాధీనం ● ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్‌ కిరణ్‌

● 100 కిలోల రాగితీగ స్వాధీనం ● ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్‌ కిరణ్‌

జ్యోతినగర్‌(రామగుండం): విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్‌వైర్‌ చోరీ చేస్తున్న కేసులో గుర్రాల చంటిని ఎన్టీపీసీ ఎస్సై ఉదయ్‌కిరణ్‌ అరెస్ట్‌ చేశారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో అరెస్ట్‌ వివరాలను ఎస్సై వెల్లడించారు. ఎన్టీపీసీ, అంతర్గాం, కమాన్‌పూర్‌, గోదావరిఖని టూ టౌన్‌ పోలీస్‌స్టేషన్ల పరిధిలో గల విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేస్తున్న ఘటనలపై తాము విచారణ చేపట్టామని అన్నారు. ఈమేరకు సంజయ్‌గాంధీ నగర్‌కు చెందిన పాత నేరస్తుడు గుర్రాల చంటిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా 10 కేసుల్లో నిందితుడిగా తేలిందని వివరించారు. నిందితుడి నుంచి 100 కేజీల రాగితీగ స్వాధీనం చేసుకున్నామని తెలిపార. చంటిని రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై వెల్లడించారు. కేసు ఛేదించడంలో ముఖ్యపాత్ర పోషించిన కానిస్టేబుళ్లు జగ్గు శ్రీను, అంజి, రమేశ్‌ను ఎస్సై అభినందించారు.

ఏకాగ్రతతో బస్సులు నడపాలి

జగిత్యాలటౌన్‌: ఏకాగ్రతతో డ్రైవింగ్‌ చేస్తే చాలావరకు ప్రమాదాలు నివారించవచ్చునని జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్‌, ఆర్టీసీ జగిత్యాల డిపో మేనేజర్‌ కల్పన అన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా సోమవారం జగిత్యాల డిపోలో సురక్షిత ప్రయాణంపై ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బందికి అవగాహన కల్పించారు. సెల్‌ఫోన్‌ మాట్లాడుతూ డ్రైవింగ్‌ చేయడం ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, చిన్న నిర్లక్ష్యం కుటుంబాలను రోడ్డున పడేస్తుందని పేర్కొన్నారు. ప్రమాదాలు జరగకుండా డ్రైవింగ్‌ చేసిన సిబ్బందిని అభినందించారు. ఎంవీఐ ప్రమీల, వెంకన్న, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.

కాపర్‌ చోరీ కేసులో   ఒకరి అరెస్ట్‌ 
1
1/1

కాపర్‌ చోరీ కేసులో ఒకరి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement