2,303
మాంసాహార..
జగిత్యాలరూరల్: దేశవ్యాప్తంగా అడవులలో సంచరిస్తున్న జంతువుల గణన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జంతుగణన ఈనెల 25తో జిల్లాలో పూర్తయింది. జిల్లాలో ఉన్న 1.25 లక్షల ఎకరాల్లో ఉన్న అడవుల్లో జంతుగణన చేపట్టారు. అటవీసిబ్బ ందితో పాటు, అడవి క్షేత్రస్థాయి అధికారులు 67 బీట్లలో సర్వే నిర్వహించారు. జంతుగణనలో శాఖాహార జంతుగణన, మాంసాహార జంతుగణన రెండు రకాలుగా చేపట్టారు. జిల్లాలో నాలుగు సెక్షన్ల పరిధిలో నాలుగు రోజుల పాటు ప్రక్రియ నిర్వహించారు.
67 బీట్లలో జంతుగణన
జిల్లాలో నాలుగు సెక్షన్ల పరిధిలో 67 బీట్లలో జంతుగణన చేపట్టారు. ప్రతీబీట్‌లో ఇద్దరు చొప్పున 134 మంది సర్వేలో పాల్గొన్నారు. ఈనెల 19 నుంచి 25 వరకు రోజుకు రెండు విడతలుగా జంతువు అడుగులు, మూత్రం, వాసన, పేడతో పాటు, ఇతర ఆధారాలను సేకరించి ఆ జంతుగణన పూర్తి చేశారు. మరికొన్ని ప్రాంతాల్లో టైగర్ జోన్ ప్రాంతాల్లో సీసీకెమెరాలను ఏర్పాటు చేసి వాటి కదలికలను సీసీకెమెరాల ఆధారంగా సర్వే చేపట్టారు.
2,303 మాంసాహార,
27,733 శాఖాహార జంతువుల గుర్తింపు
జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో ఉన్న అడవుల్లో అధికారులు సిబ్బంది బృందాలుగా ఏర్పడి 2,303 మాంసాహార జంతువులు, 27,733 శాఖాహార జంతువులు ఉన్నట్లుగా గుర్తించారు. ఇందులో మాంసాహార జంతువులు, శాఖాహార జంతువులను గుర్తించారు. ముఖ్యంగా అధికారులు జంతువులు రాత్రి వేళల్లో, మధ్యాహ్నం వేళల్లో తిరిగే జంతువులను కూడా గుర్తించి వాటి సంచారం చేసే ప్రాంతాలలో ఇద్దరికి ఒక బృందం చొప్పున వీరు అడవుల్లో తిరుగుతూ సర్వే చేపట్టారు.
అడవుల్లో సర్వే చేపడుతున్న ఉద్యోగులు, సిబ్బంది


