నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
జగిత్యాలక్రైం: జిల్లాలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ అశోక్‌కుమార్ అన్నా రు. మంగళవారం సాయంత్రం విలేకరులతో మాట్లాడారు. జగిత్యాల, రాయికల్, ధర్మపురి, కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాలిటీల్లో బుధవారం నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని, నామినేషన్ ప్రక్రియకనుగుణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేస్తామన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద 100 మీటర్ల పరిధిలో నిబంధన ఉంటుందని, 144 సెక్షన్ అమలులో ఉంటుందని అన్నారు. నామినేషన్ దాఖలు సందర్భంలో అభ్యర్థులు తప్పనిసరిగా ఎన్నికల నియమాలు పాటించాలన్నారు.
యముడికి పూజలు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహాస్వామి అనుబంధ శ్రీయమ ధర్మరాజు ఆలయంలో మంగళవారం భరణి నక్షత్రం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవస్థానం ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేద పండితుడు బొజ్జ రమేశ్‌శర్మ మంత్రోచ్చరణలతో స్వామివారికి రుద్రాభిషేకం, మన్య, ఆయు ష్య సూక్తంతో అభిషేకం చేశారు. భక్తులు అధి క సంఖ్యలో తరలివచ్చి స్వామి వారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, సీనియర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్, సిబ్బంది తదితరులున్నారు.
అభివృద్ధి బాటలో కోరుట్ల
కోరుట్ల: రెండేళ్ల కాలంలో కోరుట్ల పట్టణాన్ని అభివృద్ధి బాటలో నడిపించడంతోపాటు రూ.2కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు పంపిణీ చేసినట్లు కాంగ్రెస్ సెగ్మెంట్ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు తెలిపారు. మంగళవారం కోరుట్ల పట్టణంలోని విలీన గ్రామంలో సబ్ స్టేషన్ అప్రోచ్ రోడ్డుకు రూ.6లక్షల నిధులు మంజూరైన క్రమంలో భూమిపూజ చేశారు. కోరుట్ల, మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలాల్లోని పేదలకు రూ.2కోట్ల మేర సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేసినట్లు చెప్పారు. కోరుట్ల, మెట్‌పల్లి మున్సిపాల్టీల్లో సీసీ రోడ్డు, డ్రెయినేజీలు, కల్వర్టులు నిర్మించడానికి ఒక్కో మున్సిపాల్టీకి రూ.18కోట్ల చొప్పున మంజూరైనట్లు తెలిపారు. ఈ పనులకు టెండర్లు పూర్తయ్యాయని, త్వరలో పనులు ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు అన్నం అనిల్, తిరుమల గంగాధర్, శీలం వేణు, ఎంబేరి నాగభూషణం పాల్గొన్నారు.
నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు
నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు


