బల్దియాల్లో గులాబీ జెండా ఎగరాలి | - | Sakshi
Sakshi News home page

బల్దియాల్లో గులాబీ జెండా ఎగరాలి

Feb 4 2026 7:24 AM | Updated on Feb 4 2026 7:24 AM

బల్దియాల్లో గులాబీ జెండా ఎగరాలి

బల్దియాల్లో గులాబీ జెండా ఎగరాలి

● మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌

జగిత్యాల: మున్సిపల్‌ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేయాలని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మున్సిపల్‌ ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ అమలుగాని హామీలు ఇచ్చి విఫలమైన విషయాన్ని ఇంటింటా వివరించాలన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, అప్పటివరకు కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. అనంతరం బీఆర్‌ఎస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావును అభినందించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత, వొల్లం మల్లేశం పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement