చైర్మన్‌గిరి.. పార్టీల గురి
జగిత్యాలలో పెరుగుతున్న ఆశావహులు బీసీ మహిళా కావడంతో చాలామంది ప్రయత్నాలు ప్రతీ పార్టీలో ఇద్దరు లేదా ముగ్గురు పోటీ
జగిత్యాల: మున్సిపాలిటీలపై ఎలాగైనా జెండా ఎగురవేయాలని ప్రధాన పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. జిల్లాలో ఐదు బల్దియాలు ఉండగా, పెద్ద మున్సిపాలిటీ అయిన జగిత్యాల చైర్మన్ పదవీ మళ్లీ బీసీ మహిళకే కేటాయించడంతో రోజురోజుకు ఆశావహులు పెరుగుతున్నారు. ఎలాగైనా చైర్మన్ పీఠాన్ని కై వసం చేసుకోవాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే ముసాయిదా ఓటరు జాబితాతో పాటు, రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఎక్కడి నుంచి పోటీ చేయాలి, చైర్‌పర్సన్ పీఠం కై వసం చేసుకోవాలంటే ఎన్ని సీట్లు కావాలి, ఎవరికి ఎవరు మద్దతివ్వాలన్న దానిపై ప్రధాన పార్టీల్లో చర్చ జరుగుతోంది. జగిత్యాలలో మొత్తం 50 వార్డులు ఉన్నాయి. 26 స్థానాలు సాధించిన పార్టీకి చైర్‌పర్సన్ సీటు దక్కే అవకాశం ఉంటుంది.
సర్వేల ఆధారంగా..
ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఎలాంటి ఒత్తిళ్లు, పైరవీలకు తావు లేకుండా సర్వేల ఆధారంగానే గెలుపు గుర్రాలకు టికెట్లు ఇస్తామని పేర్కొనడంతో పాటు, ఇప్పటికే జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో 136 వార్డుల్లో సర్వే సైతం చేయించాయి. జిల్లా కేంద్రంలో ప్రధాన పార్టీలు ముఖ్య కార్యకర్తలతో సమీక్ష నిర్వహించి ఎలాగైనా జెండా ఎగురవేయాలని ఆదేశాలు జారీ చేస్తున్నాయి. కాగా, జగిత్యాల చైర్‌పర్సన్‌గా పనిచేసిన బీసీ సామాజికవర్గానికి చెందిన అడువాల జ్యోతితో పా టు, మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన సమిండ్ల వాణి చైర్‌పర్సన్ పీఠం కోసం ప్రయత్నిస్తున్నారు. తాజాగా, మున్నూరుకాపు సామాజిక వర్గం నుంచి ప్ర ముఖ వైద్యురాలు ఒడ్నాల రజిత సైతం చైర్‌పర్సన్ పదవి ఆశిస్తున్నట్లు తెలిసింది. అలాగే మరికొంత మంది వివిధ పార్టీల నుంచి ముందుకు వచ్చే అవకాశం ఉంది.
చైర్మన్‌గిరి.. పార్టీల గురి


