మట్టి తవ్వకాలపై ఆర్డీవో విచారణ
కథలాపూర్: మండలంలోని పోసానిపేటలో కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డి పర్యటించారు. గ్రామ శివారులోని గానె గుట్టను తవ్వి మట్టిని కథలాపూర్‌లోని విద్యుత్ సబ్‌స్టేషన్ పనులకు తరలించడంపై గ్రామస్తులు అభ్యంతరం వ్య క్తం చేశారు. దీంతో వివాదం నెలకొంది. అయి తే మట్టి తరలించేందుకు అనుమతి ఉందని ఆర్డీవో గ్రామస్తులకు వివరించారు. గుట్ట వెను క వైపు కాకుండా ముందు భాగంలో తవ్వకాలు చేపట్టాలని గ్రామస్తులు ఆయనకు విన్నవించా రు. కార్యక్రమంలో తహసీల్దార్ వినోద్, ఆర్‌ఐ రవీందర్, ట్రాన్స్‌కో అధికారులు ఉన్నారు.
రాయికల్ మున్సిపల్ కమిషనర్‌గా నాగరాజు
రాయికల్: రాయికల్ మున్సి పల్ కమిషనర్ మనోహర్‌గౌడ్ కరీంనగర్ జిల్లా చొప్పదండి బల్దియాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో చొప్పదండి మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజును ఇక్కడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయండి
మెట్‌పల్లి: ఆర్టీసీ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ ఉద్యోగులు పోస్ట్‌కార్డు ఉద్యమం చేపట్టారు. ఈ మేరకు గవర్నర్‌కు పంపడానికి సిద్ధం చేసిన కార్డులను బుధవారం ప్రదర్శించారు. పలువురు మాట్లాడుతూ సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తూ తీసుకున్న నిర్ణయానికి గతంలో గవర్నర్ ఆమోదం తెలిపారని, ఇప్పటికీ ఆ ప్రక్రియను పూర్తి చేయడంలో జాప్యం చేస్తున్నారని, విలీనంతో ఉద్యోగులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. విలీనానికి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌కు పోస్ట్‌కార్డులు పంపిస్తున్నామని వివరించారు.
బొమ్మెన ప్రాజెక్టు పరిశీలన
కథలాపూర్: మండలంలోని పోసానిపేట శివారులో బొమ్మెన ప్రాజెక్టును జిల్లా క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ అధికారి శ్రీనాథ్ బుధవారం పరిశీలించారు. ప్రాజెక్టులో నీటి నిల్వ, మత్తడి మరమ్మతు పనులను పరిశీలించారు. పనులు నాణ్యతగా చేయాలని కాంట్రాక్టర్‌కు సూచించారు. ఆయన వెంట అధికారులు రాజు, రాజేందర్ ఉన్నారు.
జగ్గని ఒర్రెకు మార్గం చూపండి
మల్యాల: మండలకేంద్రంలోని జగ్గని ఒర్రె సమస్యకు పరిష్కారం చూపాలని, పాలకుల నిర్లక్ష్యంతోనే డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని బీసీ, ఎస్సీ, ఎస్టీ రైట్స్, రాజ్యాధికార సాధన జేఏసీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ అన్నారు. లక్ష కిలోమీటర్ల మా భూమి రథయాత్రలో భాగంగా ఆయన బుధవారం జగ్గని ఒర్రెను స్థానికులతో కలిసి సందర్శించారు. ముందుగా శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కటికవాడ ప్రజలు తమ సమస్యలను వివరించారు. రైతులు, మహిళలతో మాట్లాడారు. తక్షణమే జగ్గని ఒర్రె సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మల్యాల, ముత్యంపేట గ్రామాల్లోని చెరువులు నింపేందుకు వరదకాలువకు తూము ఏర్పాటు చేయాలని కోరారు. కటిక కులస్తులకు ప్రభుత్వం ఉచితంగా ఫ్రిడ్జ్‌లు అందించాలన్నారు. జిల్లా ఇన్‌చార్జి దువ్వాక శివా, జిల్లా అధ్యక్షుడు మానాల కిషన్, ఉపేంద్ర, స్థానికులు పాల్గొన్నారు.
మట్టి తవ్వకాలపై ఆర్డీవో విచారణ
మట్టి తవ్వకాలపై ఆర్డీవో విచారణ
మట్టి తవ్వకాలపై ఆర్డీవో విచారణ
మట్టి తవ్వకాలపై ఆర్డీవో విచారణ


