క్లీన్ స్వీప్ చేయాలి
● మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ● గాంధీభవన్‌లో నిజామాబాద్ పార్లమెంట్ స్థాయి సమావేశం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని అన్ని మున్సిపాలిటీలను క్లీన్‌స్వీప్ చేయాలని ఇన్‌చార్జి మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులకు సూచించారు. బుధవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ సమక్షంలో జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల మున్సిపల్ ఎన్నికలపై సమీక్షించారు. ఎన్నికల్లో అమలు చేయాల్సిన వ్యూహాలపై చర్చించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ కుట్రలను తిప్పికొట్టాలని సూచించారు. బీజేపీ ఎప్పటిలాగే మతం పేరిట రాజకీయం చేయాలని చూస్తోందన్నారు. ఎన్నికలను ఆషామాషీగా తీసుకోవద్దని, ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దన్నారు. నేతలందరూ పూర్తి సమన్వయంతో కష్టపడి పనిచేయాలన్నారు. పంచాయతీ ఎన్నికల ఊపును మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని సూచించారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్‌అలీ, మాజీమంత్రులు జీవన్ రెడ్డి, మండవ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


