బీజేపీ నాయకుల అరెస్టు
ధర్మపురి: వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాక సందర్భంగా స్థానిక సమస్యలపై బీజేపీ నాయకులు వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లారు. దీంతో అక్కడున్న పోలీసులు సభా వేధిక వద్దకు రానీయకుండా అడ్డుకుని అరెస్టు చేశారు. ప్రజాసమస్యలను విన్నవించడానికి వెళ్తే అరెస్టు చేయడమేంటని నాయకులు గాజు భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు.
సభలో షార్టు సర్యూట్
డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు తుమ్మల, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్యేలు వచ్చే అరగంట ముందు సభా ప్రాంగనంలో ఏర్పాటు చేసిన స్పీకర్లు షార్ట్‌సర్క్యూట్ అయ్యాయి. పొగలు వ్యాపించడంతో సిబ్బంది అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేసి మరో స్పీకర్‌ను అమర్చారు. దీంతో జనం ఊపిరి పీల్చుకున్నారు.


