బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కొలిక్కి..! | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కొలిక్కి..!

Jan 26 2026 4:56 AM | Updated on Jan 26 2026 4:56 AM

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కొలిక్కి..!

బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కొలిక్కి..!

● అభ్యర్థుల ఎంపికలో ప్రధానంగా పార్టీ, తమ కుటుంబంపై విశ్వాసం చూపుతున్న నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనలో ఎమ్మెల్యే సంజయ్‌ ఉన్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా పార్టీకి చెందిన పలువురు తాజామాజీలకు తిరిగి మరోసారి అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. ● వీరిలో మార్గం లక్ష్మీ (ఒకటో వార్డు), అంగడి పురుషోత్తం(నాలుగో వార్డు), కిషోర్‌ (ఆరో వార్డు), మోరెపు గంగాధర్‌ (తొమ్మిదో వార్డు), కొమొరెడ్డి జ్యోతి(11వవార్డు), ఎనగందుల వనజ(17వార్డు), వుజ్జగిరి లక్ష్మీ(20వార్డు), భీమనాతి భవాని(21), ఒజ్జెల బుచ్చిరెడ్డి(23వార్డు) ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ● తాజామాజీలైనా వీరి స్థానంలో రిజర్వేషన్లను పరిగణనలోకి తీసుకొని తిరిగి వారినిగానీ, వారి కుటుంబ సభ్యులనుగాని బరిలోకి దించనున్నట్లు తెలిసింది. ● గత ఎన్నికల్లో 4వార్డు (ఎస్టీ స్థానం) నుంచి గెలుపొందిన అంగడి పురుషోత్తంకు ఈసారి అక్కడ రిజర్వేషన్‌ కలిసి రాలేదు. దీంతో ఎస్టీకి కేటాయించిన 22వార్డు నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. ● తాజామాజీలు కాకుండా 19వార్డు నుంచి ఆకుల ప్రవీణ్‌, 24వార్డు నుంచి మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌చైర్మన్‌ పూదరి సుధాకర్‌గౌడ్‌ కుటుంబానికి టికెట్లను ఖరారు చేసినట్లు తెలిసింది. ● గతంలో బీఆర్‌ఎస్‌ నుంచి కౌన్సిలర్లుగా గెలిచిన పిప్పెర లతరాజేశ్‌, చెట్లపల్లి లక్ష్మీరాజేశ్వర్‌గౌడ్‌, మర్రి సహాదేవ్‌ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ధ్యావనపల్లి వరలక్ష్మీ భర్త, పద్మశాలీ సంఘం పట్టణాధ్యక్షుడు రాజారాం ఇటీవల హస్తం గూటికి చేరారు. ● వారి వార్డులపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఎమ్మెల్యే.. వాటిల్లో బీఆర్‌ఎస్‌ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయా వార్డుల్లో బలమైన అభ్యర్థుల కోసం తీవ్ర కసరత్తు జరుపుతున్నారు. ● పార్టీలో చేరికల విషయంలోనూ ఆచీతూచి వ్యవహరిస్తున్నారు. వార్డుల్లో క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న వారికే ‘కారు’లో ఎక్కడానికి అవకాశం ఇస్తున్నారు. ● 12వార్డు నుంచి ఓ ప్రైవేట్‌ కళాశాల కరస్పాండెంట్‌ అయినా రాజేశ్వర్‌గౌడ్‌, హారిక దంపతులు ఆదివారం ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆ వార్డు నుంచి హారికకు టికెట్‌ ఇవ్వనున్నట్లు తెలిసింది.

మెట్‌పల్లి: మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి బీఆర్‌ఎస్‌లో అభ్యర్థుల ఎంపిక దాదాపుగా కొలిక్కి వచ్చింది. రెండు పర్యాయాలు చైర్మన్‌పీఠాన్ని దక్కించుకున్న ఆ పార్టీ.. ఈ ఎన్నికల్లో కూడా మరోమారు కై వసం చేసుకుని హాట్రిక్‌ సాధించాలనే దిశగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు అభ్యర్థుల ఎంపికలో ఆచీతూచి అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్‌, బీజేపీకి ధీటుగా బలమైన అభ్యర్థులను బరిలోకి దించేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా వార్డుల్లో అభ్యర్థుల ఎంపికను పూర్తి చేసినట్లు తెలిసింది.

పలువురు తాజామాజీలకు మరోసారి

ఆ వార్డులపై ప్రత్యేక దృష్టి

క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న వారికే అవకాశం

టికెట్ల కేటాయింపులో తాజామాజీలకు ప్రాధాన్యం

ఆచీతూచి అడుగులు వేస్తున్న ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement