సాక్షి సంతకం పెట్టినందుకు..
మాది బీర్‌పూర్ మండలకేంద్రం. ఓ భూమి విక్రయం సందర్భంగా రిజిస్ట్రేషన్‌లో సాక్షి సంతకం పెట్టినందుకు 2024 మార్చిలో పది మంది ఇంట్లోకి చొరబడి నాతోపాటు కుటుంబ సభ్యులపై దాడి చేశారు. చుట్టుపక్కల వారు వచ్చి అడ్డుకోవడంతో వెళ్లిపోయారు. గతంలో ప్రజావాణిలో ఫిర్యాదు చేశాను. అలాగే 2024 మే 26న బీర్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అదే నెల 28న నాపై దాడికి పాల్పడ్డారు. నా కొడుకును కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేశారు. అయినా పోలీసులు చర్యలు తీసుకోలేదు. చంపుతామని బెదిరిస్తున్న వ్యక్తుల నుంచి రక్షణ కల్పించాలని మూడేళ్లుగా ఫిర్యాదు చేస్తున్నా పట్టించుకోవడం లేదు.
– సాతర్ల వెంకటి, బీర్‌పూర్
ప్రభుత్వ భూమి కబ్జా..
కొడిమ్యాల మండలకేంద్రంలోని ఫారెస్ట్ కార్యాలయం సమీపంలో సర్వేనంబర్ 903లోని 6గుంటల ప్రభుత్వ భూమిని తప్పుడు సర్వేనంబర్ 874తో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సృష్టించి ఓ వ్యక్తి కబ్జా చేశాడు. విషయమై విచారణ జరిపి విలువైన ప్రభుత్వ భూమిని కాపాడండి. తప్పుడు రిజిస్ట్రేషన్‌తో ప్రభుత్వ భూమి కాజేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోండి.
సీహెచ్.సురేశ్, కొడిమ్యాల
సాక్షి సంతకం పెట్టినందుకు..


