‘ఎస్‌ఐఆర్’ మ్యాపింగ్ పూర్తిచేయాలి
జగిత్యాల: స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్‌ఐఆర్) మ్యాపింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్‌తో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. జిల్లాలో ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ శాతాం పెంచేందుకు బూత్‌లెవల్ ఆఫీసర్లు తప్పనిసరిగా ఫీల్డ్ విజిట్ చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇంటింటి సర్వే ద్వారా ఓటర్ల వివరాలు నిర్దేశించాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు బూత్‌లెవల్ ఏజెంట్లను నియమించుకుని పొరపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఓటర్ల సౌలభ్యం కోసం బుక్ ఏ కాల్ సదుపాయంపై విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ 69.94 శాతం పూర్తయిందని, వందశాతం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ బీఎస్.లత, ఆర్డీవోలు మధుసూదన్, శ్రీనివాస్ పాల్గొన్నారు.


