అన్ని మున్సిపాల్టీలూ గెలుచుకుంటాం | - | Sakshi
Sakshi News home page

అన్ని మున్సిపాల్టీలూ గెలుచుకుంటాం

Jan 26 2026 4:56 AM | Updated on Jan 26 2026 4:56 AM

అన్ని

అన్ని మున్సిపాల్టీలూ గెలుచుకుంటాం

కోరుట్ల: జిల్లాలో అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్‌ గెలుచుకుంటుందని పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ కోరుట్ల అసెంబ్లీ ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రంలో సుమారు రూ.3600 కోట్లు ఖర్చు చేసి పేదలకు సన్నబియ్యం అందిస్తున్నామని, గృహజ్యోతి పథకం కింద ఉచిత విద్యుత్‌, ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నామని, పథకాల విషయంలో ప్రజలు సంతృప్తితో ఉన్నారని పేర్కొన్నారు. జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌ విజయం సాధించేలా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలన్నారు. జువ్వాడి నర్సింగరావు పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నారని తెలిపారు. మెట్‌పల్లిలో వరదకాలువకు నీటి విడుదల, కోరుట్లలో తాగునీటి కొరత తీర్చేందుకు తాళ్లచెరువుకు ఎస్సారెస్పీ నీరు అందిస్తామన్నారు. మంత్రి అడ్లూరి మాట్లాడుతూ జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలు గెలుచుకునేందుకు అందరూ కృషి చేయాలన్నారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అన్నిచోట్లా విజయం సాధిస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు. టికెట్లు రానివారికి నామినేటెడ్‌ పోస్టులు ఇస్తుందన్నారు. నర్సింగరావు మాట్లాడుతూ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గాజుల నందయ్య, నాయకులు కొమొరెడ్డి విజయ్‌, సుజిత్‌రావు, తిరుమల గంగాధర్‌, అన్నం అనిల్‌, శీలం వేణు, పుప్పాల ప్రభాకర్‌, వాకిటి సత్యంరావు, జెట్టి లింగం, ఆడెపు మధు పాల్గొన్నారు.

మంత్రి అడ్లూరితో మాజీ వైస్‌చైర్మన్‌ లింబాద్రి భేటీ

మెట్‌పల్లి: మెట్‌పల్లి మున్సిపల్‌ మాజీ వైస్‌ చైర్మన్‌ మైలారపు లింబాద్రి ఆదివారం కోరుట్లలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో భేటీ కావడం చర్చనీయాంశమైంది. బీఆర్‌ఎస్‌కు చెందిన లింబాద్రి అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీ చైర్మన్‌ అభ్యర్థిగా ఆయన పేరు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో కోరుట్లలో జరిగిన కాంగ్రెస్‌ మున్సిపల్‌ ఎన్నికల సన్నాహాక సమావేశం అనంతరం లింబాద్రిని పార్టీ నియోజక ఇన్‌చార్జి నర్సింగరావు మంత్రితో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయించి మాట్లాడించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నందయ్య కూడా ఉన్నారు.

మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

పాల్గొన్న పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌ గౌడ్‌

అన్ని మున్సిపాల్టీలూ గెలుచుకుంటాం1
1/1

అన్ని మున్సిపాల్టీలూ గెలుచుకుంటాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement