ముక్తీశ్వర ఎత్తిపోతల ప్రారంభం
● రూ.81 లక్షలతో మరమ్మతు పూర్తి ● మంత్రి లక్ష్మణ్ కుమార్
వెల్గటూర్: మండలంలోని ముత్తునూర్‌లో కొద్దికాలంగా నిరుపయోగంగా ఉన్న ఎత్తిపోతల పథకాన్ని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ప్రారంభించారు. మోటార్లను ఆన్ చేసి మూడు గ్రామాలకు సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముత్తునూర్‌లోని ముక్తీశ్వర ఎత్తిపోతలకు రూ.81లక్షలతో మరమ్మతు చేయించామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షపాతి అని, గోదావరిపై ఆధారపడిన ముత్తునూర్, ఆరేపల్లి, జైన, రాజారాం, మండపేట, రాయపట్నం, తిమ్మాపూర్ తదితర గ్రామాల రైతులకు నీటి ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు. కాంట్రాక్టర్ ద్వారా నిరంతర పర్యవేక్షణ, తక్షణ మరమ్మతు చేపడతామని తెలిపారు. ఏఎంసీ చైర్మెన్ గోపిక, వైస్ చైర్మెన్ తిరుపతి, నాయకులు శైలేందర్‌రెడ్డి, మంజుల, మురళి, ప్రతాప్‌రావు, రమేశ్, నరేష్, సర్పంచులు, రైతులు పాల్గొన్నారు.


