టోల్ ఫ్రీనంబర్ 96662 34383
7
నృసింహుని బ్రహ్మోత్సవాలు ప్రారంభం
జగిత్యాలరూరల్: బీర్‌పూర్ మండలకేంద్రంలోని శ్రీలక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. బీర్‌పూర్, నర్సింహులపల్లి గ్రామాలమీదుగా దేవస్థానం వరకు స్వామివారి శోభాయాత్ర నిర్వహించారు. ఈవో సంకటాల శ్రీనివాస్, ఆలయ చైర్మన్ చీర్నేని శ్రీనివాస్, సభ్యులు, అర్చకులు, సర్పంచ్ హరీశ్, ఉపసర్పంచ్ జితేందర్, నర్సింహులపల్లి సర్పంచ్ ఎడ్ల సృజన, ఆలయ జూనియర్ అసిస్టెంట్ రఘు పాల్గొన్నారు.
జగిత్యాల: మున్సిపల్ ఎన్నికల్లో సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశామని, అందులో 96662 34383 టోల్‌ఫ్రీ నంబర్ ప్రారంభించామని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. కంట్రోల్‌రూంను బుధవారం పరిశీలించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఏవైనా సమస్యలున్నా.. ఇతరత్రా ఫిర్యాదులను టోల్ ఫ్రీ నంబర్‌కు తెలపాలని సూచించారు. ఇది 24గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, నోడల్ ఆఫీసర్ రాజ్‌కుమార్, నరేశ్, భాస్కర్, హకీం ఉన్నారు.
ప్రశాంత ఎన్నికలకు సహకరించండి
ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కలెక్టర్ రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. కలెక్టరేట్‌లో వారితో సమావేశమయ్యారు. కోడ్ అమలులో ఉన్నందున పార్టీల రాతలు, వాల్‌పోస్టర్లు, ఫ్లెక్సీలు తొలగించాలని సూచించారు. నామి నేషన్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల వద్ద 100మీటర్ల దూరం నిబంధన పాటించాలన్నారు. ఎన్నికల కమిషన్ సూచనలకు లోబడి ఖర్చు చేసుకోవాలని సూచించారు. అడిషనల్ ఎస్పీ శేషాద్రినిరెడ్డి, నోడల్ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయాలి
మెట్‌పల్లి: మున్సిపాలిటీల్లో ప్రతి నామినేషన్ స్వీకరణ కేంద్రం వద్ద హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ సూచించారు. పట్టణంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. అభ్యర్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలన్నారు. అన్ని రకాల ఫారాలను అందుబాటులో ఉంచాలని, సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. నామినేషన్ల స్వీకరణ సజావుగా జరిగేలా పర్యవేక్షించాలన్నారు. ఆర్డీఓ శ్రీనివాస్, కమిషనర్ మోహన్ ఉన్నారు.
నియమావళి పక్కాగా అమలు చేయాలి
కోరుట్ల: పట్టణంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. ఎన్నికల నియమావళి తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు.
రాయికల్‌లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి
రాయికల్: రాయికల్ మున్సిపాలిటీలో ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేశామని బల్దియా స్పెషల్ ఆఫీసర్, జెడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి అన్నారు. నామినేషన్లు, ఎన్నికల ఏర్పాట్లపై మాట్లాడారు. బల్దియాలో 12వార్డులు ఉన్నాయని, వీటి పరిధిలో 13,084 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వీరిలో 6,157 మంది పురుషులు, 6,927 మంది మహిళలు ఉన్నారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఒక అభ్యర్థి నాలుగు సెట్ల చొప్పున నామినేషన్లు వేయవచ్చని, ప్రతిపాదకుడు మాత్రం ఒకే నామినేషన్‌పై సంతకం చేయాల్సి ఉంటుందన్నారు. ఇతర నామినేషన్లపై సంతకాలు చేస్తే చెల్లదని వివరించారు. అభ్యర్థులు రూ.లక్షలోపు ఎన్నికల కోసం ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. మున్సిపల్ కార్యాలయంలోనే నామినేషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. మొత్తం 24 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 24 మంది పీవోలు, 72 మంది ఏపీవోలను నియమించామని పేర్కొన్నారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. జెడ్పీహెచ్‌ఎస్ బాలుర, బాలికల కాంప్లెక్స్‌లో 1, 2, 4, 5, 9, 10, 11, 12 వార్డులు, ఇందిరానగర్‌లోని ఎంపీపీఎస్‌లో 3, మత్తడివాడ ఉర్దూమీడియంలో 6, ఒడ్డెరకాలనీలో 8, మున్సిపల్ కార్యాలయంలో 7వ వార్డుకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఎస్‌ఎస్‌టీ, ఎఫ్‌ఎస్‌టీ టీంలతో ఎప్పటికప్పుడు నిఘా పెడుతున్నట్లు వివరించారు.
బీ–ఫామ్‌ల కోసం ఎదురుచూపులు
అత్యధికంగా కాంగ్రెస్ నుంచే..
బల్దియా ఎన్నికల్లో సమస్యల పరిష్కారానికి..
వెల్లడించిన కలెక్టర్ సత్యప్రసాద్
ప్రతిపాదకుడు ఒకేసెట్‌పై సంతకం చేయాలి
రాయికల్ స్పెషల్ ఆఫీసర్ గౌతమ్‌రెడ్డి
టోల్ ఫ్రీనంబర్ 96662 34383
టోల్ ఫ్రీనంబర్ 96662 34383
టోల్ ఫ్రీనంబర్ 96662 34383
టోల్ ఫ్రీనంబర్ 96662 34383
టోల్ ఫ్రీనంబర్ 96662 34383


