గ్రేడ్–3 మున్సిపాలిటీ నుంచి..
జగిత్యాల పట్టణం వ్యూ
మున్సిపాలిటీ కార్యాలయం
జగిత్యాల: జగిత్యాల.. 1952లో గ్రేడ్–3 మున్సిపాలిటీగా ఏర్పడింది. 1984లో గ్రేడ్–2గా ఆవిర్భవించింది. 2009లో గ్రేడ్–1గా అవతరించింది. తెలంగాణ రాష్ట్రం వచ్చాక జిల్లాల పునర్విభజనలో భాగంగా జగిత్యాలను జిల్లాగా చేశారు. అప్పటినుంచి జిల్లాలో అతిపెద్ద మున్సిపాలిటీగా జగిత్యాల పేరుగాంచింది. ముందుగా 38 వార్డులు ఉండగా.. ప్రస్తుతం 50 వార్డులు, 96,410 మంది ఓటర్లతో విస్తరించింది. 2016లో జిల్లాగా అవతరించిన అనంతరం మెడికల్ కళాశాల, కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలు, ఇతరత్రా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. ఎన్‌హెచ్–63, ఎన్‌హెచ్–563 జగిత్యాల మీదుగానే వెళ్తాయి. 17వ శతాబ్దంలో ఫ్రెంచ్ ఇంజినీర్లు నిర్మించిన ఖిల్లా ఇప్పటికీ ఉంది. దాదాపు 20 ఎకరాల్లో విస్తరించిన ఈ కోట నక్షత్రాకారంలో ఉంటుంది. క్లాక్ టవర్ ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు.
అంచెలంచెలుగా ఎదిగిన జగిత్యాల బల్దియా
50వార్డులు.. జిల్లాకేంద్రంగా
గ్రేడ్–3 మున్సిపాలిటీ నుంచి..


