‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌తో ప్రయోజనం
మల్లాపూర్: సాక్షి స్టడీ మెటీరియల్‌తో పదో తరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని ఎంఈవో కేతిరి దామోదర్‌రెడ్డి అన్నారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు సాక్షి రూపొందించిన గణితం, భౌతికశాస్త్రం స్టడీ మెటీరియల్‌ను హెచ్‌ఎం చంద్రమోహన్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. ప్రైవే టు పాఠశాలలకు దీటుగా విద్యార్థులు రాణించాలని, నిరుపేదలకు అండగా నిలవాలనే లక్ష్యంతో ఉచితంగా మెటీరియల్ అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. విద్యార్థులు సద్వినియోగం చేసుకుని మంచి మార్కులు సాధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కర్, సురేష్, నర్సయ్య, శివరాం, సజ్జన్న, రాజశేఖర్, రమేశ్, విశ్వ, సాజిద్, విక్రమ్, సాక్షి సిబ్బంది పాల్గొన్నారు.
కోరుట్ల బల్దియాపై బీఆర్‌ఎస్ జెండా ఎగరేస్తాం
● ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల: బల్దియాపై బీఆర్‌ఎస్ జెండా ఎగరేస్తామని, ఇందుకు నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. 27వ వార్డుకు చెందిన అంబటి శ్రీనివాస్‌తోపాటు పలువురు బుధవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ బీఆర్‌ఎస్ హయాంలో కోరుట్లలో జరిగిన అభివృద్ధిని వివ రిస్తూ మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని సూచించారు. బీఆర్‌ఎస్ హయాంలో ప్రతి ఒక్కరూ లబ్ధి పొందారని తెలిపారు. పార్టీని బలోపేతం చేసేందుకు కలిసి కట్టుగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌లు, బీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయండి
● దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజారామయ్యర్
జగిత్యాల: వచ్చే ఏడాది నిర్వహించే గోదావరి పుష్కరాలకు ఇప్పటినుంచే పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని దేవాదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజారామయ్యర్ తెలిపారు. కలెక్టర్‌తో బుధవారం కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. గోదావరి నది ప్రవహించే జిల్లాల్లో పుష్కరాలకు సంబంధించి పుష్కర ప్రదేశాలను టైర్–1, టైర్–2, టైర్–3గా విభజించాలని, ఏర్పాట్లపై ప్రణాళిక రూపొందించాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.
నామినేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి
ధర్మపురి: నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా కొనసాగించాలని అదనపు కలెక్టర్ రాజాగౌడ్ అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను బుధవారం పరిశీలించారు. నామినేషన్ల కోసం చేసిన ఏర్పాట్లు, మీడియాసెంటర్, వసతులపై ఆరా తీశారు. అలాగే మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వందమీటర్ల దూరంలో ఉండాలని మార్కింగ్ చేశారు. వాహనాలను లోనికి రాకుండా సీఐ రాంనర్సింహారెడ్డి ఆధ్వర్యంలో ఎస్సై మహేశ్, ఉదయ్‌కుమార్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ తదితరులున్నారు.
‘నానో’తో ప్రయోజనం
జగిత్యాలఅగ్రికల్చర్: నానో ఎరువులతో రైతులకు ప్రయోజనం చేకూరుతుందని జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ అన్నారు. పొలాస వ్యవసాయ పరిశోధన స్థానంలో ఇఫ్కో సంస్థ ఆధ్వర్యంలో ఎఫ్‌పీఓల కార్యదర్శులకు నానో ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. అధిక రసాయన ఎరువులతో భూములు దెబ్బతింటున్నాయన్నారు. డీఏవో భాస్కర్ మాట్లాడుతూ ద్రవ రూపంలో ఉండే యూరియాతో పంటలకు మేలు జరుగుతుందన్నారు.


