మున్సి‘పోల్స్’కు ఏర్పాట్లు
జగిత్యాల: జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహ ణలో అధికారులు పూర్తిగా నిమగ్నమయ్యారు. నోటిఫికేషన్ రాకముందే పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. జిల్లాలో ఐదు మున్సిపాలిటీలు.. 136 వార్డులున్నాయి. మూడు వార్డులకో ఆర్వో, ఏఆర్వోలు, కౌంటింగ్ స్టాఫ్, జోనల్ ఆఫీసర్లను నియమించారు. మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ బాక్స్ పద్ధతిన నిర్వహించనున్న నేపథ్యంలో మొత్తం 379 జెంబో బ్యాలెట్లు తెప్పించారు. 188 బిగ్‌సైజ్ బ్యాలెట్లు, అదనంగా మరో 74 సిద్ధం చేశారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాలను కూడా ఎవరికీ ఇబ్బందులు లేకుండా జగిత్యాలలో 2, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురిలో ఒకొక్కటి, కోరుట్లలో 3 చొప్పున ఏ ర్పాటు చేశారు. జగిత్యాలలో మున్సిపల్ ఆఫీస్ తోపాటు మెప్మా బిల్డింగ్‌లో నామినేషన్లు స్వీకరించనున్నారు. రాయికల్, ధర్మపురిలో ఆయా మున్సి పల్ కార్యాలయాల్లో, మెట్‌పల్లిలో మెప్మా కార్యాల యం, కోరుట్లలో మున్సిపల్ కార్యాలయంతోపాటు ఎంపీడీవో, సీనారె భవన్‌లో స్వీకరించనున్నారు. అభ్యర్థులు నామినేషన్ వేసేందుకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఈసారి కౌంటింగ్ సెంటర్‌ను జిల్లాకేంద్రంలోని ఎస్‌కేఎన్‌ఆర్ డిగ్రీ కళా శాలలో ఏర్పాటు చేయనున్నారు. 379 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ సిద్ధం చేశారు. జోనల్ ఆఫీసర్లు 50, ఫ్లయింగ్‌స్క్వాడ్ 6, స్టాటిస్టికల్ సర్వైలైన్స్ టీమ్స్ 5 ఏర్పాటు చేశారు. ఈ టీమ్స్ ఇబ్బందులు రాకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నాయి.
కౌంటింగ్‌కు స్టాఫ్..
ఐదు మున్సిపాలిటీల్లో 136 వార్డులుండగా.. 136 టేబుల్స్ ఏర్పాటు చేయనున్నారు. 136 మంది సూపర్‌వైజర్లు, 272 కౌంటింగ్ అసిస్టెంట్లు మొత్తంగా 408 మందిని నియమించారు.
మూడు వార్డులకో రిటర్నింగ్ అధికారి
గతంలో నామినేషన్ పత్రాలను కమిషనర్లే స్వీకరించేవారు. ప్రస్తుతం కేంద్రాలను పెంచడంతో మూ డు వార్డులకో రిటర్నింగ్ అధికారులను నియమించారు. తద్వారా అభ్యర్థులకు ఇబ్బందులు ఉండవు. ప్రతి రిటర్నింగ్ అధికారికి ఒక ప్రత్యేక కౌంటర్ కేటాయిస్తారు. పార్టీ అభ్యర్థులు, స్వతంత్రులకు వీరే గుర్తులు కేటాయించనున్నారు. ఎన్నికలు పూర్తయ్యేవరకు ఆర్వోలే కీలకంగా వ్యవహరిస్తారు. ధ్రువీకరణ పత్రాలు అందించే బాధ్యత కూడా వీరి కే ఉంటుంది. ఎన్నికల ప్రక్రియ మొత్తం వీరి పర్యవేక్షణలోనే జరగనుంది. నామపత్రాల స్వీకరణ, పరిశీ లన, తిరస్కరణ అంతా వీరే చూసుకోనున్నారు. ఇప్పటికే కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఆర్వోలు, ఏఆర్వోలు, కమిషనర్లకు శిక్షణ కల్పించారు. ఎన్నికల్లో ఎలా నిర్వహించాలి? ఇబ్బంది లేకుండా ఎలా చూడాలి..? అనే అంశంపై శిక్షణ కల్పించారు.
మూడు వార్డులకో ఆర్వో
కౌంటింగ్ స్టాఫ్ నియామకం
మున్సి‘పోల్స్’కు ఏర్పాట్లు


