డీఎం దృష్టికి తీసుకెళ్లా
సంగెం నుంచి నాగులపేట హైస్కూల్‌కు వెళ్లే విద్యార్థులు బస్సు లేక ఇబ్బంది పడుతున్నారని నా దృష్టికి వచ్చింది. పాఠశాల సమయంలో బస్సు నడపాలని కోరుట్ల ఆర్టీసీ డీఎంకు చెప్పాను. కంకరరోడ్డు విషయం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాను. నిధులు విడుదల కా కాంట్రాక్టర్ మధ్యలోనే పనులు నిలిపివేశాడు. నిధుల విడుదలకు ప్రయత్నం చేస్తాం.
– కల్వకుంట్ల సంజయ్, కోరుట్ల ఎమ్మెల్యే
కాలినడకన వెళ్తున్నాం
రాజారాంతండాలో హైస్కూల్ లేదు. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతకుంట జెడ్పీ హైస్కూ ల్‌లో ఏడో తరగతి చదువుతున్న. బస్సు సౌకర్యం లేక ప్రతీరోజు కాలినడకన.. లేకుంటే బైక్‌లపై లిఫ్ట్ ఎక్కి పాఠశాలకు పోతున్నాం. ఒక్కోసారి పాఠశాలకు చేరుకోవడం ఆలస్యం అవుతోంది. బస్సు సౌకర్యం కల్పించాలి. – లకావత్ దివ్య,
ఏడో తరగతి, రాజారాంతండా
డీఎం దృష్టికి తీసుకెళ్లా


