హక్కులపై అవగాహన పెంచుకోవాలి
మల్యాల/కొడిమ్యాల: విద్యార్థులు తమ హక్కులపై అవగాహన పెంచుకోవాలని టీజీఎస్‌సీపీసీఆర్ (తెలంగాణ రాష్ట్ర కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్) చైర్‌పర్సన్ సీతా దయాకర్‌రెడ్డి అన్నారు. మల్యాలలోని జెడ్పీ బాలికల ఉన్నత, కస్తూరిబా, కొడిమ్యాల మండలం సంద్రాలపల్లిలోని కస్తూరిబా విద్యాలయాలను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతిలోనే జీవిత లక్ష్యం ఏర్పరుచుకోవాలని, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ నిర్ధేశించుకున్న లక్ష్య సాధనకు నిరంతరం కష్టపడి చదవాలని సూచించారు. ముందుగా కొండగట్టు శ్రీఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో బృందం సభ్యులు వచన్ కుమార్, అపర్ణ, ప్రేమలత అగర్వాల్, డీఈఓ రాము, కొడిమ్యాల సెక్టోరియల్ ఆఫీసర్ మహేశ్, ఎంఈఓ శ్రీనివాస్, ఎస్సీ వెల్ఫేర్ ఆఫీసర్ రాజు, చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ హరీశ్, పాఠశాల ప్రిన్సిపల్ లావణ్య పాల్గొన్నారు.
జగిత్యాల: అనంతరం కలెక్టర్ సత్యప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అధికారులతో సమావేశమయ్యారు. బాలల హక్కుల పరిరక్షణ, నాణ్యమైన విద్యనందించడం, సురక్షితమైన, అనుకూలమైన వాతావరణం కల్పించడానికే పర్యటించామని పేర్కొన్నారు.


