చదువుకోవాలంటే నడవాల్సిందే..
కోరుట్లరూరల్/కథలాపూర్/పెగడపల్లి: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు సమయానికి బస్సులు లేక.. సరిపడా రాక తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు బడిబాట కార్యక్రమం పేరిట విస్తృతంగా ప్రచారం చేస్తున్నప్పటికీ వారికి సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నారనే విమర్శలున్నాయి. కథలాపూర్ మండలం రాజారాంతండా విద్యార్థులు హైస్కూల్ చదువుకు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న చింతకుంటకు వెళ్లాల్సిందే. వీరికి బస్సు సౌకర్యం లేక కాలినడకన, బైక్‌లపై లిఫ్ట్ అడిగి పాఠశాల చేరుతున్నారు. బస్సు సౌకర్యం కల్పించాలని ఏళ్లుగా విన్నవించినా పట్టించుకునేవారు కరవయ్యారని గ్రామస్తులు మండిపడుతున్నారు. కోరుట్ల నుంచి కథలాపూర్ వరకు ఉదయం, సాయంత్రం విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని దుంపేట, పోసానిపేట గ్రామాల విద్యార్థులు కోరుతున్నారు. కోరుట్ల మండలం సంగెం విద్యార్థులు కంకరరోడ్డుపైనే నడుచుకుంటూ నాగులపేట హైస్కూల్‌కు వెళ్తున్నారు. సంగెంలో ఐదో తరగతి వరకే ఉంది. తర్వాతి చదువులకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నాగులపేటకు వెళ్తుంటారు. సంగెం నుంచి ప్రతిరోజూ సుమారు 50 మంది విద్యార్థులు కాలినడకన వెళ్తూ ఇబ్బంది పడుతున్నారు. పెగడపల్లి మండలంలో ఏడు ఉన్నత పాఠశాలలున్నాయి. మోడల్ స్కూల్ విద్యార్థులకు సమాయానుకూలంగా బస్సులు రాకపోవడంతో ఆటోలు, టాటా ఏసీ వాహనాలను అద్దెకు తీసుకుంటున్నారు. నందగిరి, అయితిపల్లి, కీచులాటపల్లి, రాజరాంపల్లి, సుద్దపల్లి, బతికపల్లి, లింగాపూర్, నంచర్ల నుంచి బస్ సౌకర్యం ఉన్నా సమయానికి రావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు.
జిల్లాలోని పాఠశాల, విద్యార్థుల వివరాలు
సమయానికి రావు.. సరిపడా ఉండవు
నడిచి వెళ్లలేక విద్యార్థుల అవస్థలు
కొన్ని గ్రామాల్లో కిలోమీటర్ల మేర నడకే..
ఆటోల్లో ఇబ్బంది పడుతూ పాఠశాలలకు..
చదువుకోవాలంటే నడవాల్సిందే..
చదువుకోవాలంటే నడవాల్సిందే..
చదువుకోవాలంటే నడవాల్సిందే..
చదువుకోవాలంటే నడవాల్సిందే..


