కడప నగరంలో గురువారం శ్రీరామ మహాశోభాయాత్ర కనుల పండువగా జరిగింది.
అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో చిన్నచౌకులోని శ్రీ ఆంజనేయస్వామి ఆలయం వద్ద నుంచి యాత్ర ప్రారంభమైంది.
ఉదయం 7.45 గంటలకు శోభాయాత్ర ప్రారంభించారు. అప్పటికే వేలాది మంది ప్రజలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళ వాయిద్యాలు, దిక్కులు పిక్కటిల్లేలా జై శ్రీరామ్ నినాదాల మధ్య శోభాయాత్ర అత్యంత వైభవంగా ముందుకు సాగింది.


