కట్టలు తెంచుకున్న ఆగ్రహం | - | Sakshi
Sakshi News home page

కట్టలు తెంచుకున్న ఆగ్రహం

Feb 4 2026 7:24 AM | Updated on Feb 4 2026 7:24 AM

కట్టల

కట్టలు తెంచుకున్న ఆగ్రహం

బీ ఫామ్‌ రానివారిలో కట్టలు తెంచుకున్న ఆగ్రహం జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌పై బూతు పురాణం మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఇంటి వద్దకు భారీగా కాంగ్రెస్‌ కార్యకర్తలు

జగిత్యాలటౌన్‌: దశాబ్దం పాంటు పార్టీ జెండా మోసిన వారిని పక్కనపెట్టి బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న వారికి కాంగ్రెస్‌ టికెట్లు ఇచ్చారంటూ ఆ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగిత్యాల బల్దియాకు కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితా విడుదల కావడంతో టికెట్‌ రాని వారు మంగళవారం మాజీమంత్రి జీవన్‌రెడ్డిని కలిసి తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. టికెట్ల కేటాయింపులో ఎమ్మెల్యే సంజయ్‌ వర్గానికే ప్రాధాన్యం ఇచ్చారని తప్పుబట్టారు. ఇప్పటికీ బీఆర్‌ఎస్‌ పార్టీలోనే కొనసాగుతున్న వారికి కాంగ్రెస్‌ టికెట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ జెండా మోసినోళ్లకు టికెట్లు వస్తాయనే ఆశతో ఎదురుచూస్తే నిరాశే ఎదురైందని ఆవేదన వ్యక్తం చేశారు. సంజయ్‌కుమార్‌ తన పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీచేయాలని డిమాండ్‌ చేశారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఓ నాయకుడు తన భుజంపై ఉన్న కాంగ్రెస్‌ కండువాను కింద పడేశాడు. ఆగ్రహంతో ఎమ్మెల్యే సంజయ్‌పై బూతు పురాణం అందుకున్నారు. తమ నాయకుడు జీవన్‌రెడ్డి అని, ఆయన నిర్ణయమే ఫైనల్‌ అని తేల్చిచెప్పారు.

జీవన్‌రెడ్డి ముందు ఆవేదన

జగిత్యాల: కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాలో జగి త్యాల 26వ వార్డు నుంచి వీరబత్తిని పద్మజకు సో మవారం రాత్రి టికెట్‌ కేటాయించారు. మంగళవా రం చివరి నిమిషంలో గొల్లపల్లి మాధవిలతకు ఇచ్చారు. దీంతో పద్మజ జీవన్‌రెడ్డి వద్దకు వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. మాధవి ఎమ్మెల్యే వర్గంలో కొనసాగుతున్నారు. టికెట్‌ రాకపోవడంతో జీవన్‌రెడ్డి వద్దకు రావడం కొసమెరుపు. అక్కడికే వెళ్లి తేల్చుకోవాలని జీవన్‌రెడ్డి బదులివ్వడం కొసమెరుపు

బీజేపీలోనూ నిరసన జ్వాలలు

తాను పేద కార్యకర్తనని, టికెట్‌ వస్తుందని ఆశించినా అన్యాయం చేసిందంటూ బీజేపీ సీనియర్‌ కార్యకర్త ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో 22వ వార్డు మహిళకు కేటాయించడంతో పులి శ్రీధర్‌ బీజేపీ నుంచి తన తల్లిని నిలబెట్టి గెలిపించుకున్నారు. ఈసారి కూడా 25వ వార్డు జనరల్‌ మహిళకు రిజర్వ్‌ అయింది. ఈసారి కూడా తన తల్లిని నిలబెట్టేందుకు శ్రీధర్‌ సిద్ధమైనా టికెట్‌ దక్కకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

కంటతడి పెట్టిన లత

ధర్మపురి: బీజేపీ నుంచి పోటీ చేయడానికి నామినేషన్‌ వేసిన అభ్యర్థికి బీఫాం రాకపోవడంతో మున్సిపల్‌ కార్యాలయం ఆవరణలో కంటతడి పెట్టారు ధర్మపురిలోని 8వ వార్డుకు చెందిన దోనకొండ లత. తన భర్త దోనకొండ నరేష్‌ బీజేపీ సీనియర్‌ నాయకుడని, దళిత మోర్చ జిల్లా ప్రధానకార్యదర్శి అయినా బీఫాం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసారు.

కట్టలు తెంచుకున్న ఆగ్రహం1
1/1

కట్టలు తెంచుకున్న ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement