కుల బహిష్కరణ ప్రచారం.. 8 మందిపై కేసు | - | Sakshi
Sakshi News home page

కుల బహిష్కరణ ప్రచారం.. 8 మందిపై కేసు

Jan 26 2026 4:56 AM | Updated on Jan 26 2026 4:56 AM

కుల బ

కుల బహిష్కరణ ప్రచారం.. 8 మందిపై కేసు

జమ్మికుంట: కుల బహిష్కరణ చేసినట్లు సోషల్‌ మీడియాలో ప్రచారం చేసినవారిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టౌన్‌ సీఐ రామకృష్ణ ఆదివారం తెలిపారు. మున్సిపల్‌ పరిధిలోని కేశవపూర్‌కు చెందిన బాణాల వెంకటేశ్‌ తల్లి కమలమ్మ గతేడాది చనిపోయింది. అప్పుడు దినకర్మ సందర్భంగా వెంకటేశ్‌తో అతడి అక్క మనమ్మ, బావ కర్నే రాములు, అల్లుళ్లు కర్నే వెంకటేశ్‌, రమేశ్‌, భాస్కర్‌, శ్రీకాంత్‌తో గొడవలు జరిగాయి. కాగా ఈ నెల 23న సంవత్సరికం కార్యక్రమానికి తమన పిలవలేదని వెంకటేశ్‌ను అతడి బావ, అల్లుళ్లు దూషించారు. అయినా బాధితుడు పట్టించుకోలేదు. దీంతో వెంకటేశ్‌ను కుల బహిష్కరణ చేస్తున్నట్లు అతడి బావ, అల్లుళ్లు, పెద్దమనుషులు కర్నే గోపాల్‌, కర్నే నరేందర్‌, బాణాల లక్ష్మణ్‌ వీడియో తీసి సోషల్‌మీడియాలో ప్రచారం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు 8 మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

షార్ట్‌ సర్క్యూట్‌తో కిరాణంషాపులో మంటలు

మల్యాల: మండలంలోని నూకపల్లి డబుల్‌బెడ్‌రూం కాలనీలోని కిరాణ దుకాణంలో షార్ట్‌ సర్క్యూట్‌లో మంటలు చెలరేగి సామగ్రి దగ్ధమైంది. కాలనీలోని పాలిక కమలాకర్‌ తన షాపును శనివారం రాత్రి మూసి ఇంటికెళ్లాడు. కొద్దిసేపటికే మంటలు చెలరేగాయి. స్థానికులు గమనించి కమలాకర్‌కు సమాచారం అందించారు. ఫైరింజన్‌ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. ప్రమాదంలో సుమారు రూ.2లక్షల విలువైన కిరాణ సామగ్రి కాలిపోయినట్లు బాధితుడు తెలిపాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్‌కుమార్‌ తెలిపారు.

జిలెటిన్‌ స్టిక్స్‌ పట్టివేత

వేములవాడరూరల్‌: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్‌ పరిధిలోని కోనాయపల్లిలో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 1200 జిలిటెన్‌ స్టిక్స్‌లను పోలీసులు పట్టుకున్నారు. వేములవాడ నుంచి ఆటోలో తరలిస్తున్న జిలిటెన్‌ స్టిక్స్‌లను పోలీసులు తనిఖీలు చేస్తుండగా పట్టుబడ్డాయి. ఈ జిలిటెన్‌ స్టిక్స్‌లను వేములవాడ పరిధిలోని నాంపల్లి వార్డుకు చెందిన ఒక వ్యక్తి తరలిస్తున్నట్లు తెలిసింది. ఈమేరకు పోలీసులు విచారణ జరుపుతున్నట్లు తెలిసింది.

కుల బహిష్కరణ ప్రచారం.. 8 మందిపై కేసు 1
1/1

కుల బహిష్కరణ ప్రచారం.. 8 మందిపై కేసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement