ఒకే రోజు నలుగురు మృతి | - | Sakshi
Sakshi News home page

ఒకే రోజు నలుగురు మృతి

Jan 20 2026 7:38 AM | Updated on Jan 20 2026 7:38 AM

ఒకే ర

ఒకే రోజు నలుగురు మృతి

చందుర్తి(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో సోమవారం వివిధ కారణాలతో నలుగురు మృతిచెందారు. మండల కేంద్రానికి చెందిన మర్రి మల్లేశం గ్రామంలోనే ఎయిర్‌ కంప్రెషర్‌ నడుపుతూ జీవించేవారు. పదిహేను రోజుల క్రితం బీపీ, షుగరు లెవల్స్‌ పెరిగాయి. కరీంనగర్‌లో వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని అక్కడి నుంచి హైదరాబాద్‌ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. రూ.లక్షలు ఖర్చు పెట్టిన ఆరోగ్యం కుదటపడకం పోవడంతోపాటు మృతిచెందాడు. మరో రెండు గంటల వ్యవధిలోనే అదే గ్రామానికి చెందిన బుర్ర లక్ష్మీదేవి అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఈ సంఘటన జరిగిన మూడు గంటల వ్యవధిలోనే అదే గ్రామానికి చెందిన ఏనుగు రాజయ్య పక్షవాతం వ్యాధి తగ్గకపోవడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వేములవాడ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మృతిచెందాడు. రాజయ్య భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు చందుర్తి ఎస్సై రమేశ్‌ తెలిపారు. మరొకరు చిలుక భాస్కర్‌(72) అనారోగ్యంతో రాత్రి చనిపోయాడు.

ఒకే రోజు నలుగురు మృతి 1
1/2

ఒకే రోజు నలుగురు మృతి

ఒకే రోజు నలుగురు మృతి 2
2/2

ఒకే రోజు నలుగురు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement