పొరండ్లలో దొంగల హల్‌చల్
జగిత్యాలక్రైం: జగిత్యాలరూరల్ మండలం పొరండ్లలో శనివారం అర్ధరాత్రి దొంగలు హల్‌చల్ చేశారు. సీసీ కెమెరాల్లో కనిపించకుండా వెనుక నుంచి వెళ్లి చోరీలకు పాల్పడ్డారు. గోస్కుల గంగాధర్ కిరాణషాపు తాళాలు పగులగొట్టి రూ.12వేలు, పుట్ట లక్ష్మీ ఇంట్లో నుంచి 30 తులాల మల్లన్న దేవుడి వెండి విగ్రహం, వేములవాడ రాజేశం ఇంట్లో నుంచి 20తులాల వెండి, 10 గ్రాముల బంగారం, రూ.18వేలు ఎత్తుకెళ్లారు. మరో రెండు ఇళ్లలో చొరీకి విఫల యత్నం చేశారు. రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై ఉమాసాగర్ సంఘటన స్థలానికి చేరుకొని, వేలిముద్రలు సేకరించారు. మూడిళ్లలో చోరీ జరగడంపై గ్రామస్తులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు.
10 గ్రాముల బంగారం, 50 తులాల వెండి అపహరణ


