‘సాక్షి’ స్టడీమెటిరియల్ చదివితే 90 శాతం మార్కులు
ఇబ్రహీంపట్నం: ‘సాక్షి’ అందిస్తున్న ఫిజిక్స్, మ్యాథ్స్ స్టడీమెటిరియల్ చదివితే 90శాతం మార్కులు సాధించవచ్చని ఎంఈవో మధు తెలిపారు. మండలకేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ స్టడీమెటిరియల్ ఉచితంగా అందించారు. మండలంలోని 8 హైస్కూల్‌కు చెందిన 216 మంది విద్యార్థులకు మెటీరియల్ అందించారు. తహసీల్దార్ వరప్రసాద్ మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులకు అర్థమయ్యేలా మెటీరియల్ తయారు చేసి ఉచితంగా ఇవ్వడం గొప్ప విషయమన్నారు. ‘సాక్షి’ యాజమాన్యం ఇంతమంచి మెటిరియల్‌ను అందించడం అభినందనీయమన్నారు. ఎంపీడీవో గణేశ్ మాట్లాడుతూ.. శ్రద్ధతో చదివితే మంచి మార్కులు సాధించవచ్చన్నారు. సర్పంచు బద్దం గోపి, ఉపసర్పంచు నాంపెల్లి రమేశ్, హెచ్‌ఎం రాజన్న, ఉపాధ్యాయులు కవిత, విద్యార్థులు పాల్గొన్నారు.


