ఎన్నికల నియమావళి పాటించాలి
జగిత్యాల/ధర్మపురి: ఎన్నికల నియమావళిని ప్రతిఒక్కరూ పాటించాలని వ్యయ పరిశీలకులు శ్రీనివాస్ అన్నారు. జగిత్యాలలోని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. ఆర్వోలు ప్రతి ధ్రువీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని, అభ్యర్థులు కచ్చితంగా బ్యాంక్ ఖాతా తీసుకోవాలని సూచించారు. పార్టీ పరంగా చేసే వ్యయం అన్నింటిని నమోదు చేయాలని సూచించారు. ఆయన వెంట నోడల్ అధికారి శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ స్పందన ఉన్నారు. అనంతరం శ్రీనివాస్ ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ల ప్రక్రియను పరిశీలించారు. కార్యక్రమంలో నోడల్ అధికారి శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ ఆర్వోలు, ఏఆర్‌వో పాల్గొన్నారు.


