గెలుపోటములను సమానంగా స్వీకరించాలి | - | Sakshi
Sakshi News home page

గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

Jan 24 2026 7:23 AM | Updated on Jan 24 2026 7:23 AM

గెలుప

గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

మెట్‌పల్లి(కోరుట్ల): పోటీల్లో గెలుపోటములను సమానంగా స్వీకరించాలని సీనియర్‌ సివిల్‌ మెజిస్ట్రేట్‌ నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు. గణ తంత్ర వేడుకలను పురస్కరించుకొని స్థానిక మినీ స్టేడియంలో శుక్రవారం న్యాయవాదుల మధ్య ఫ్రెండ్లీ క్రికెట్‌ మ్యాచ్‌ నిర్వహించారు. దీ నిని మెజిస్ట్రేట్‌ ప్రారంభించి మాట్లాడారు. క్రీడలు వ్యక్తుల మధ్య స్నేహభావాన్ని పెంపొందిస్తాయని, ఏటా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించడం అభినందనీ యమన్నారు. కార్యక్రమంలో జూనియర్‌ సివిల్‌ మెజిస్ట్రేట్‌ అరుణ్‌కుమార్‌, అధ్యక్షుడు కంతి మోహన్‌రెడ్డి, న్యాయవాదులు పాల్గొన్నారు.

పీహెచ్‌సీ తనిఖీ

కథలాపూర్‌(కోరుట్ల): మండలంలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని శుక్రవారం జిల్లా వైద్యాధికారి సుజాత తనిఖీ చేశారు. పీహెచ్‌సీలోని ఫార్మసీ, ల్యాబ్‌, పేషెంట్‌ గదులను పరిశీలించారు. పీహెచ్‌సీకి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యం అందించి ఆరోగ్య సలహాలు అందించాలన్నారు. పీహెచ్‌సీ పరిధిలోని గర్భిణుల సంఖ్య, ప్రసవాల తీరును అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట డెప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్‌, డీపీవో రవీందర్‌, వైద్యాధికారి సింధూజ, సిబ్బంది ఉన్నారు.

సకాలంలో టీకాలు వేయాలి

కథలాపూర్‌(కోరుట్ల): పశువులకు సకాలంలో టీకాలు వేసి పాడిపరిశ్రమ అభివృద్ధికి పశు వైద్యసిబ్బంది సహకరించాలని జిల్లా పశు సంవర్థకశాఖ అధికారి ప్రకాశ్‌ పేర్కొన్నారు. శుక్రవారం కథలాపూర్‌లోని పశు వైద్యశాలను తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. గ్రా మాల్లో ఇటీవల నిర్వహించిన గాలికుంటు వ్యాఽ ది నివారణ టీకాల శిబిరాల గురించి తెలుసుకున్నారు. ఆయన వెంట పశువైద్యాధికారి ది వ్య శ్రీ, సిబ్బంది రాజుకుమార్‌, రసూల్‌ ఉన్నారు.

సమర్థవంతంగా జంతుగణన

జగిత్యాలరూరల్‌: జంతుగణన సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా అటవీశాఖ అధికారి రవిప్రసాద్‌ అన్నారు. శుక్రవారం సారంగాపూర్‌, లక్ష్మీదేవిపల్లి అడవుల్లో చేపడుతున్న జంతుగణనను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అడవుల్లో శాఖాహార, మాంసాహార జంతువులను పేడ, కాలిగుర్తులతో క్షుణ్ణంగా గుర్తించాలన్నారు. రానున్న వేసవికాలంలో జంతవులను రక్షించేందుకు నీటి సౌకర్యం కల్పించాలని, ప్రజల సహకారంతో అడవులు, వన్యప్రాణులను కాపాడాలన్నారు. ఎఫ్‌ఆర్వో పద్మారావు, డెప్యూటీ రేంజర్‌ రవికుమార్‌, ఎఫ్‌బీవోలు రవీంద్రనాయక్‌, ప్రేమ్‌కుమార్‌, గోపాల్‌ పాల్గొన్నారు.

‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ అందజేత

జగిత్యాల: జిల్లా కేంద్రంలోని ధరూర్‌ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శుక్రవారం పదో తరగతికి సంబంధించి ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ అందజేశారు. ఈ సందర్భంగా హెచ్‌ఎం అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ, శ్రీసాక్షిశ్రీ ఆధ్వర్యంలో బుక్స్‌ అందించడం అభినందనీయమన్నారు. విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు.

గెలుపోటములను  సమానంగా స్వీకరించాలి1
1/4

గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

గెలుపోటములను  సమానంగా స్వీకరించాలి2
2/4

గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

గెలుపోటములను  సమానంగా స్వీకరించాలి3
3/4

గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

గెలుపోటములను  సమానంగా స్వీకరించాలి4
4/4

గెలుపోటములను సమానంగా స్వీకరించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement