వైజ్ఞానిక ప్రదర్శనలో ప్రతిభ
రాయికల్(జగిత్యాల): సంగారెడ్డి జిల్లాలో నిర్వహిస్తున్న దక్షిణ భారత వైజ్ఞానిక ప్రదర్శనలో రాయికల్ మండలం కుమ్మరిపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్‌రాజ్ బోధనోపకరణ విభాగంలో రూపొందించిన సైన్స్‌కిట్‌కు ద్వితీయస్థానం లభించింది. ఎంపీ రఘునందన్‌రావు, రాష్ట్ర విద్య పరిశోధన సంస్థ డైరెక్టర్ రమేశ్, డీఈవో వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ప్రశంసాపత్రం, జ్ఞాపిక అందుకున్నారు. అభయ్‌రాజ్‌ను డీఈవో రాము, జిల్లా సైన్స్ అధికారి మచ్చ రాజశేఖర్, ఎంఈవో రాఘవులు అభినందించారు.


