బల్దియాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి | - | Sakshi
Sakshi News home page

బల్దియాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

Jan 25 2026 7:21 AM | Updated on Jan 25 2026 7:21 AM

బల్దియాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

బల్దియాల్లో కాంగ్రెస్‌ జెండా ఎగరాలి

● జెండా మోసినవారికి అండగా ఉంటాం ● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

రాయికల్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ జెండా ఎగురవేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ సూచించారు. కష్టకాలంలో కాంగ్రెస్‌ జెండా మోసిన కార్యకర్తలకు అండగా ఉంటామని సూచించారు. రాయికల్‌లో శనివారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పదేళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన ప్రతి కార్యకర్త తనకు తెలుసని, సామాన్య ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటూ ప్రాధాన్యం కల్పిస్తానని భరోసా ఇచ్చారు. మాదిగకుంట అభివృద్ధి, ఫైర్‌స్టేషన్‌ పునఃప్రారంభం, ప్రభుత్వ ఆస్పత్రి స్థలాన్ని రక్షించాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

అభివృద్ధి అనేది బాధ్యత

నియోజకవర్గ అభివృద్ధి అనేది ఎమ్మెల్యే బాధ్యత అని మాజీమంత్రి జీవన్‌రెడ్డి తెలిపారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.70 కోట్లతో బోర్నపల్లి బ్రిడ్జి మంజూరు చేయించానని, పదవులు లేకున్నా మంత్రి సహకారంతో రూ.17కోట్లతో జగన్నాథపూర్‌–బోర్నపల్లి గ్రామాల మధ్య వంతెన నిర్మాణానికి కృషి చేశానని పేర్కొన్నారు. పట్టణంలో తాగునీటి సమస్య ఉన్నప్పుడు బావులు తవ్వించామన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య, పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్‌, మాజీ జెడ్పీటీసీ గోపి మాధవి, హనుమాన్‌ ఆలయ కమిటీ చైర్మన్‌ దాసరి గంగాధర్‌, యూత్‌ పట్టణ అధ్యక్షుడు నాగరాజు, మండల అధ్యక్షుడు మహేందర్‌గౌడ్‌, యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కొయ్యడి మహిపాల్‌రెడ్డి, జిల్లా నాయకులు షాకీర్‌, రాకేశ్‌నాయక్‌, ఎద్దండి భూంరెడ్డి, బత్తిని భూమయ్య పాల్గొన్నారు.

కోరుట్లలో అభివృద్ది పనులకు శంకుస్థాపన

కోరుట్ల: కోరుట్లలో 646 మహిళాసంఘాలకు రూ.2.62 కోట్ల వడ్డీ రాయితీ చెక్కులను కలెక్టర్‌ సత్యప్రసాద్‌, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌తో కలిసి మంత్రి అడ్లూరి మహిళాసంఘాల సభ్యులకు అందించారు. ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కు గ్యాస్‌ సిలండర్‌, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఇందిరమ్మ ఇళ్లు వంటి పథకాలను చేపడుతోందన్నారు. అనంతరం పట్టణంలోని పలు వార్డుల్లో రూ.18.70 కోట్ల వ్యయంతో నిర్మించే సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. కాంగ్రెస్‌ కోరుట్ల ఇన్‌చార్జి జువ్వాడి నర్సింగరావు, ఆర్డీవో జివాకర్‌ రెడ్డి, తహసీల్దార్‌ కృష్ణ చైతన్య, మున్సిపల్‌ కమిషనర్‌ రవీందర్‌, వివిధ శాఖల అధికారులు, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి

మెట్‌పల్లి: జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి స్పష్టం చేశారు. పట్టణంలో యూఐడీఎఫ్‌ నిధులు రూ.18.70కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 325 మ హిళాసంఘాలకు రూ.2.20కోట్ల రుణాలు అందించారు. కార్యక్రమంలో అడిషనల్‌ కలెక్టర్‌ రాజాగౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ కూన గోవర్దన్‌ ఉన్నారు.

మహిళాసంఘాల అభివృద్ధికి కృషి

మహిళా సంఘాలకు త్వరలో సోలార్‌ ప్రాజెక్టులు అందిస్తామని మంత్రి అన్నారు. పట్టణంలో రూ.7.20 కోట్లతో అభివృద్ధి పనులకు భూ మిపూజ చేశారు. మహిళ సంఘాలకు రూ.11 లక్షల వడ్డీలేని రుణాలను ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో కలిసి పంపిణీ చేశారు. నిరుపేదలు ఆర్థికంగా ఎదగడానికి సీఎం రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని తెలి పారు. చీరల పంపిణీ, సన్నబియ్యం అందిస్తున్నామని వివరించారు. ఆరుగ్యారంటీ పథకాల్లో నాలుగు అమలు చేశామని, మరికొద్ది రోజుల్లోనే రెండు పథకాలను అమలు చేస్తామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం సహకారంతో కాంట్రాక్టర్లకు పెండింగ్‌ బిల్లులు ఇప్పించామని, మురికికాలువలు, సీసీరోడ్లు చేపట్టామని తెలిపారు. కలెక్టర్‌ మాట్లాడుతూ మహిళాసంఘాలు ఎక్కువగా రుణాలు పొందేలా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అడిషనల్‌ కలెక్టర్‌ రాజాగౌడ్‌, ఆర్డీవో మధుసూదన్‌, కమిషనర్‌ నాగరాజు, మెప్మా ఏవో శ్రీనివాస్‌, తహసీల్దార్‌ నాగార్జున, ఎంపీడీవో చిరంజీవి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement