బీర్‌పూర్ నృసింహాలయంలో జిల్లా జడ్జిల పూజలు
జగిత్యాలరూరల్: బీర్‌పూర్‌లోని శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో జిల్లా జడ్జి రత్నపద్మావతి, అడిషనల్ జిల్లా జడ్జి నారాయణ, కోరుట్ల జూనియర్ జ డ్జి పావని, జగిత్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జ డ్జి లావణ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. న్యా యమూర్తులను ఆలయ కమిటీ ఘనంగా సన్మానించింది. ఆలయ చైర్మన్ శ్రీనివాస్, యశోద, రమేశ్, చిన్న గంగాధర్, అర్చకులు రఘు పాల్గొన్నారు.
ఉత్సాహంగా క్రికెట్ పోటీలు
జగిత్యాలజోన్: తీర్పులు, వాదనలతో తో బిజీగా ఉండే జడ్జిలు, న్యాయవాదులకు నిర్వహించిన క్రికెట్ పోటీలు శనివారం ఉల్లాసంగా సాగాయి. ఎడీఎం ఎలెవన్ జట్టు, పీడీఎం ఎలెవన్ జట్టుపై విజయం సాధించింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి, మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణ, రెండో అదనపు జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ లావణ్య, కోరుట్ల జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ జి. పావని బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఆటగాళ్లను ఉత్సాహపర్చారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, ఉపాధ్యక్షుడు సిరిపురం మహేంద్రనాథ్, స్పోర్ట్స్ కార్యదర్శి కంచె సురేశ్ పాల్గొన్నారు.
బీర్‌పూర్ నృసింహాలయంలో జిల్లా జడ్జిల పూజలు


