గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
జగిత్యాల: గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిద్దామని అదనపు కలెక్టర్ లత అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. రెవెన్యూ, పోలీస్, డీఆర్డీవో, మున్సిపల్ అధికారులు ఏ ర్పాట్లను పర్యవేక్షించాలన్నారు. ఆహ్వానితులు, విద్యార్థులు, ప్రజలకు అవసరమైన నీటి సదుపాయం కల్పించాలని, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. పతాకావిష్కరణ అనంతరం పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలకు ఏర్పాట్లు చేయాలన్నారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో రఘువరణ్, డీపీఆర్వో నరేశ్, మున్సిపల్ కమిషనర్ స్పందన, తహసీల్దార్ రాంమోహన్‌ఉన్నారు.
బాల్య వివాహాలు నిర్మూలించాలి
మల్యాల: బాల్య వివాహాలు రూపుమాపేందుకు అందరూ కృషి చేయాలని, బాలిక విద్యను ప్రోత్సహించాలని జిల్లా సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కరంజీయ నిఖిష అన్నారు. మండలకేంద్రంలోని జెడ్పీ బాలుర పాఠశాలలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు చదువుతోపా టు, చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. విద్య ప్రాధాన్యతను గుర్తించాలని, లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఉన్నత శిఖరాలు చేరుకోవాలని కోరారు. కార్యక్రమంలో హెచ్‌ఎం అనుపమ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
బాల్య వివాహాలు చట్టరీత్యా నేరం
జగిత్యాలరూరల్: బాల్య వివాహాలు చట్టరీత్య నేరమని జగిత్యాల ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, కోరుట్ల జూనియర్ సివిల్ జడ్జి పావని అన్నారు. బీర్‌పూర్‌లో బాల్య వివాహాల చట్టంపై విద్యార్థులకు అవగాహన కల్పించా రు. పోషకాహారం, పరిశుభ్రత, విద్య ప్రాముఖ్య త, గుడ్ టచ్ బ్యాడ్ టచ్‌పై వివరించారు. బీర్‌పూర్ ఎస్సై రాజు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.
పుట్టగొడుగులతో ఆర్థికంగా అభివృద్ధి
రాయికల్: పుట్టగొడుగుల ద్వారా రైతులు ఆర్థికంగా వృద్ధి సాధించవచ్చని జిల్లా పట్టు పరిశ్రమ అధికారి గడ్డం శ్యామ్‌ప్రసాద్ అన్నారు. పట్టణంలో కుర్మ ప్రభాకర్ పుట్టగొడుగుల పెంపకాన్ని శనివారం పరిశీలించారు. ప్రభుత్వం నుంచి అందుతున్న సబ్సిడీ వివరాలను అడిగి తెలుసుకున్నారు. 45రోజుల్లోనే పంట చేతికొస్తుందని, ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ ఉద్యాన అధికారి కందుకూరి స్వాతి, మైక్రో ఇరిగేషన్ ఇంజినీర్ సాయి, ఉద్యాన విస్తీర్ణాధికారి రాజేశ్, తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ పథకాలు అందిస్తాం
కథలాపూర్: అర్హుందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. మండలంలోని సిరికొండలో 88 మందికి కల్యాణలక్ష్మి, 40 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. ఎన్నికలప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేస్తోందన్నారు. నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసే సూరమ్మ ప్రాజెక్టు పనులు వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తామన్నారు. తహసీల్దార్ వినోద్, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, ముదాం రవి, నాగం భూమయ్య, బద్దం మ హేందర్‌రెడ్డి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం


