వెల్లివిరిసిన వసంతం
వేడుకల్లో భక్తులు
ధర్మపురిలో స్వామివారల ఊరేగింపు
కోరుట్లలోని జ్ఞాన సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసం
ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి ప్రధాన, అనుబంధ ఆలయాల్లో శుక్రవారం వంసత పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్థులైన యోగ, ఉగ్ర లక్ష్మీనృసింహస్వామి, వేంకటేశ్వరస్వాములను ఊరేగింపుగా తీసుకెళ్లి భోగ మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. అలాగే కోరుట్ల పరిధిలోని సరస్వతి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అక్షరాభ్యాసాలు చేశారు. పట్టణంలోని అయ్యప్ప, జ్ఞాన సరస్వతి, సంగెంలోని సరస్వతిదేవీ ఆలయంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. శివ మార్కండేయ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. – ధర్మపురి/కోరుట్ల/కోరుట్లరూరల్
వెల్లివిరిసిన వసంతం
వెల్లివిరిసిన వసంతం


