జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపిక
హుజూరాబాద్/చొప్పదండి: హుజూరాబాద్‌కు చెందిన నలుగురు విద్యార్థులు ఈ నెల 27 నుంచి 31 వరకు జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో జరిగే జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యారు. ఇటీవల వనపర్తిలో జరిగిన పోటీల్లో నిమ్మటూరి లవణీప్రియ, రిషి, అభినయ్, చరణ్‌లు ప్రతిభచాటి జాతీయ జట్టులో చోటు సంపాదించారు. అలాగే చొప్పదండి మండలం రుక్మాపూర్ సైనిక్ స్కూల్‌కు చెందిన తొమ్మిదో తరుగతి విద్యార్థి చరణ్ సైతం జాతీయస్థాయి హాకీ పోటీలకు ఎంపికయ్యాడు. చరణ్‌ను పాఠశాల డైరెక్టర్ కల్నల్ రాజాదత్త, ప్రిన్సిపాల్ వి.లింగయ్య, ధర్మరాజు, శ్రీనివాస్, ప్రమోద్ రాజు అభినందించారు.


