మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యం
జగిత్యాల: మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కలెక్టరేట్‌లో 938 మహిళా సంఘాలకు రూ.2,98,40,444 రుణాలు పంపిణీ చేశారు. బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, మహాలక్ష్మీ ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంట్, సోలార్ ప్లాంట్లు, పెట్రోల్‌బంక్‌లు, అద్దె బస్సులు, ఇందిరా మహిళాశక్తి భవన నిర్మాణాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. స్వయం ఉపాధి అవకాశం కల్పించడం, చిరువ్యాపారాలు, కుటీర పరిశ్రమల ను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్ మాట్లాడుతూ వడ్డీలేని రుణాలతో మహిళలు స్వశక్తితో ఎదిగి ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగవచ్చన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. మహిళలను కోటీశ్వరులను చేయాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్ పాల్గొన్నారు.


