‘కొరవట్టు’ కవి సమ్మేళనాలతో విలసిల్లి..
కోరుట్ల: పదకొండో శతాబ్దంలో నాటి జైన, చాళుక్యుల పాలన సమయంలో ‘కొరవట్టు’ కవి సమ్మేళనాలతో విలసిల్లిన గ్రామం నేడు కోరుట్ల మున్సిపాలిటీగా మారింది. ఆనాటి చారిత్రక చిహ్నాలుగా కోట బురుజులు, మెట్లబావి, వేద సంస్కృత పాఠశాల ఇప్పటికీ పూర్వ వైభవాన్ని చాటుతున్నాయి. 1988 వరకు నగర పంచాయతీగా ఉన్న కోరుట్ల ఏడేళ్లపాటు స్పెషలాఫీసర్ల పాలనలో కొనసాగింది. అనంతరం గ్రేడ్–3 మున్సిపాలిటీగా ఎదిగింది. 1995లో మొదటిసారి మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. తాజాగా ఐదోసారి ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 33 వార్డులు, 65,307 మంది ఓటర్లు ఉన్నారు.
చాళుక్యుల పాలన చారిత్రక నేపథ్యం
నగర పంచాయతీ నుంచి మున్సిపాలిటీగా..
కోరుట్ల బల్దియా ప్రాశస్త్యం


